Tecno Spark 30 4G: 64ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్

Highlights

  • గ్లోబల్‌గా Tecno Spark 30 విడుదల
  • 256జిబి స్టోరేజీ, 64ఎంపి కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Spark 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. సరే, స్పార్క్ 30 ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Spark 30 ధర, లభ్యత

Tecno Spark 30 స్మార్ట్‌ఫోన్ టాంజానియా దేశంలో లాంచ్ అయ్యింది. టెక్నో టాంజానియా అధికార వెబ్‌సైట్ లో ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. అయితే ధర వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆర్బిట్ వైట్ మరియు ఆర్బిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Spark 30 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 30 లో 6.78-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 30 లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ అందించారు. సాధారణ వాడకానికి, గేమింగ్ కి ఈ ఫోన్ సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 30 స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో యూజర్లకు 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Spark 30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 14ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 30 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Spark 30 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Spark 30 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ స్పీకర్, డాల్బీ అట్మాస్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.