
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus 13 3సీ సర్టిఫికేషన్ వివరాలు
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై PJZ110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. అంటే ఏ విధమైన అప్‌గ్రేడ్ లేదని తెలుస్తోంది. గత మోడల్ OnePlus 12 కూడా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
లేటెస్ట్ ప్రాసెసర్ తో రానున్న OnePlus 13 శక్తివంతమైన ఫోన్ గా నిలవనుంది.
బ్యాటరీ విభాగం విషయానికి వస్తే, OnePlus 13 డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది గత మోడల్ (5,500mAh) తో పోల్చితే 500ఎంఏహెచ్ ఎక్కువ. అలాగే OnePlus 13 డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం.
OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: OnePlus 13 లో 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్, 10-బిట్ ఎల్టీపీవో బీఓఈ ఎక్స్2 మైక్రో-కర్డ్ ప్యానెల్ ఉంటుంది. డిస్ప్లే వివరాలను వన్‌ప్లస్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
ప్రాసెసర్: OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ చిప్సెట్ అక్టోబర్ లో విడుదలవుతుంది.
కెమెరా: OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఎల్‌వైటీ600 పెరిస్కోప్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. వన్‌ప్లస్ 13 డివైజ్ 6,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోందని కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
అక్టోబర్ నెలలో OnePlus 13 చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ లో OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.












