హైలైట్స్:
- తన ఒక-నెల వ్యాలిడిటీ ప్లాన్స్ గ్రూప్ కి మరో రెండు కొత్త ప్లాన్స్ జత చేసిన బీఎస్ఎన్ఎల్
- బీఎస్ఎన్ఎల్ అందించే వన్-మంత్ వాలిడిటీ ప్లాన్ ద్వారా లభిస్తోన్న 100ఎస్ఎంఎస్/ప్రతిరోజు, అపరిమిత వాయిస్ కాల్స్, 2జిబి డేటా/ప్రతిరోజు
- ఛాలెంజెస్ ఎరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్ బెనిఫిట్
మరో రెండు వన్-మంత్ ప్లాన్స్ ని బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ ఫ్రీ కాలింగ్ తో పాటు, జియో లో ఉన్న ఈ తరహా ప్లాన్స్ కంటే ఎక్కువ డేటాను అందిస్తున్నాయి. అలాగే ఈ రెండు బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ కూడా అందుబాటు ధరలోనే లభ్యమవుతున్నాయి. ఈ రెండు ప్లాన్స్ ధర రూ.250 లోపే ఉంది. ఈ వన్-మంత్ వ్యాలిడిటీ ప్యాక్స్ నెలలో ఉన్న రోజులను బట్టి, 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీ లేదంటే, 28 లేదా 29 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. సాధారణ బెనిఫిట్స్ తో పాటు, ఈ రెండు ప్లాన్స్ ఛాలెంజెస్ ఎరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ ను వెబ్ బ్రౌజర్ ద్వారా అందిస్తున్నాయి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు.
దేశ వ్యాప్తంగా ఉన్న విభిన్న సర్కిల్స్ లో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలు వేరుగా ఉండనున్నాయి. రీఛార్జ్ చేసుకునే ముందు బీఎస్ఎన్ఎల్ సైట్ లో గానీ, లేదంటే, బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ లో సంప్రదించి గానీ, సమాచారం తెలుసుకోవాలని మేం సూచిస్తున్నాం. మరి ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ అందిస్తోన్న ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
BSNL Rs 228 ప్లాన్: డేటా మరియు ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ రూ.228 ప్లాన్ ద్వారా ఒక నెల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి. డేటా అయిపోయిన తర్వాత యూజర్లు 80 కేబీపీఎస్ స్పీడ్ తో బ్రౌజింగ్ చేసుకునే అవకాశముంది. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. వెబ్ బ్రౌజర్ ద్వారా ఛాలెంజెస్ ఎరీనా మొబైల్ గేమింగ్ సర్వీస్ ను యూజర్లు వినియోగించుకునే అవకాశం కూడా ఉంది.
BSNL Rs 239 ప్లాన్: డేటా మరియు ప్రయోజనాలు
రూ.239 ప్లాన్ తో బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాలింగ్ ను అందిస్తోంది. అలాగే యూజర్లు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, 2జిబి డేటా ను పొందుతారు. డెయిలీ డేటా లిమిట్ 2జిబి పూర్తయ్యాక, ఇంటర్నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్ కు పడిపోతుంది. అలాగే బీఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఏదైనా వెబ్ బ్రౌజర్ ద్వారా ఛాలెంజెస్ ఎరీనా అనే మొబైల్ గేమింగ్ సర్వీస్ ను వినియోగించుకోవచ్చు.
ఇక అన్ని టెలీకామ్ సంస్థలు 5జీ వైపు పరుగులు పెడుతుంటే, బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4జీ సేవలను ప్రారంభించలేదు. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ కి భారీ ప్యాకేజీని సాయంగా ప్రకటించడంతో బీఎస్ఎన్ఎల్ త్వరలోనే 4జీ సేవలను లాంచ్ చేయాలని భావిస్తోంది. 2023 లో 4జీ సేవలు భారతదేశ వ్యాప్తంగా అందించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ వెనువెంటే, 5జీ కి మారేందుకు వేగంగా అడుగులు వేస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. 4జీ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్, టీసీఎస్ తో చేతులు కలిపింది.














