
ప్రతీ ధర శ్రేణిలో ఎన్నో స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ అవసరాలను బట్టి, కొన్ని ఫోన్లు ఒకే కేటగిరీలోనే వేరే వాటికంటే బెటర్ గా ఉంటాయి. అవి మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వొచ్చు. మీరు గనుక, రీమార్కబుల్ కెమెరా క్వాలిటీ గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఆర్టికల్‌లో, మనం రూ.25,000 లోపు అందుబాటులో ఉన్న మంచి కెమెరా ఫోన్లు ఏవో తెలుసుకుందాం.
Best camera phones (రూ.25,000 లోపు)
| స్మార్ట్‌ఫోన్ | ప్రారంభ ధర |
| ఐకూ జెడ్9ఎస్ ప్రో | రూ.24,999 |
| మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ | రూ.22,999 |
| వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 | రూ.24,999 |
| నథింగ్ ఫోన్ (2ఏ) | రూ.23,999 |
| రెడ్మీ నోట్ 13 ప్రో | రూ.23,999 |
iQOO Z9s Pro
iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో కెమెరా పెర్ఫామెన్స్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫోకస్ ఫాస్ట్‌గా, షట్టర్ స్పీడ్స్ బాగున్నాయి.
అయితే లో-లైట్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికీ, వైబ్రంట్, డీటెయిల్డ్ ఇమేజెస్, అద్భుతమైన డైనమిక్ రేంజ్ ను ఈ ఫోన్ డెలివర్ చేస్తోంది. అల్ట్రావైడ్ లెన్స్ విషయానికి వస్తే, వివిడ్, హై-కాంట్రాస్ట్ షాట్స్ ను బాగా క్యాప్చర్ అవుతున్నాయి. పొట్రెయిట్స్ షార్ప్‌గా, స్కిన్ టోన్స్ ఆక్యురేట్ గా ఉన్నాయి. బొకే ఎఫెక్ట్ మాత్రం నేచురల్ గా లేదు.
| బాగున్నవి | బాగాలేనివి |
| మంచి డైనమిక్ రేంజ్ | లో-లైట్ ఇష్యూస్ |
| అద్భుతమైన అల్ట్రావైడ్ లెన్స్ పనితనం | అసహజమైన బొకే ఎఫెక్ట్ |
| సాలిడ్ పొట్రెయిట్ మోడ్ |
ఇతర స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
- చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
- ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
- బ్యాటరీ, చార్జింగ్: 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ చార్జింగ్
Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఇంప్రెస్సివ్ షాట్స్ డెలివర్ చేస్తోంది. అయితే కలర్స్ కాస్త బూస్ట్ చేస్తోంది. ఆకాశాన్ని ఎక్కువ నీలంగా, గడ్డిని మరింత పచ్చగా చేస్తోంది.
పొట్రెయిట్, నైట్ మోడ్స్ విషయంలో ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంది. డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తోంది. అయితే, ల్యాండ్‌స్కేప్ సెల్ఫీస్ విషయంలో బగ్ వల్లన, క్యాషెస్ లేదా బొకే ఎఫెక్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్, సరైన స్కిన్ టోన్స్ అందిస్తోంది.
| బాగున్నవి | బాగాలేనివి |
| కలర్‌ఫుల్, వైబ్రంట్ ఇమేజెస్ | కలర్ బూస్టింగ్ |
| పొట్రెయిట్ మోడ్‌లో అద్భుతమైన ఎడ్జ్ డిటెక్షన్ | అసహజమైన బొకే ఎఫెక్ట్ |
| మంచి సెల్ఫీ కెమెరా | ల్యాండ్‌స్కేప్ సెల్ఫీ మోడ్‌లో బగ్ |
| మంచి లో-లైట్ పెర్ఫామెన్స్ |
ఇతర స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ ప్యానెల్
- చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
- ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
- బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus Nord CE 4
OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్ లో నార్డ్ సీఈ4 పనితీరు బాగుంది. సరైన వైట్ బ్యాలన్స్, సహజ రంగులు ఇమేజెస్ లో బాగున్నాయి.
కెమెరా డీసెంట్ డీటెయిల్స్‌ని క్యాప్చర్ చేసింది. అయితే డార్క్ బ్లూ టోన్స్ మరియు పొట్రెయిట్ షాట్స్ లోని ఫేషియల్ డీటెయిల్స్ విషయాల్లో కెమెరా కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. పొట్రెయిట్ మోడ్ రిచ్ బొకే ఎఫెక్ట్, ఎడ్జ్ డిటెక్షన్ అందిస్తోంది. అయితే, హై-రెజ్ మోడ్ యొక్క కలర్ కన్సిస్టెన్సీ సరిగ్గా లేదు.
| బాగున్నవి | బాగాలేనివి |
| నేచురల్ కలర్ ప్రొడక్షన్ | అల్ట్రావైడ్ షాట్స్ లో సాఫ్ట్ డైనమిక్ రేంజ్ |
| క్రిస్ప్ డీటెయిల్స్ కోసం హై-రెజ్ మోడ్ | ఫేషియల్ డీటెయిల్స్ సాఫ్ట్ అవ్వడం |
| పొట్రెయిట్ మోడ్‌లో యాక్యురేట్ ఫేస్ డిటెక్షన్ |
ఇతర స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
- చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3
- ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- బ్యాటరీ, చార్జింగ్: 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ చార్జింగ్
Nothing Phone (2a)
Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్ కెమెరాలు పిక్సెల్-బైనింగ్ ద్వారా 12.5ఎంపి ఇమేజెస్‌ను బైడీఫాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. డే-లైట్ లో షార్ప్, డీటెయిల్డ్ షాట్స్ మంచి డైనమిక్ రేంజ్, కాంట్రాస్ట్ తో వస్తున్నాయి.
కలర్స్ పూర్తిగా నేచురల్ గా లేవు. అవి వైబ్రంట్ మరియు పంచీగా ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ డీసెంట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాస్త వార్మ్ టోన్స్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాతో పోల్చితే తక్కువ క్వాలిటీ గల ఇమేజెస్‌ను అల్ట్రావైడ్ అందిస్తోంది. లో-లైట్ కండీషన్స్ లో కెమెరాలు ఆటోమేటిక్ గా నైట్ మోడ్‌కి స్విచ్ అవుతున్నాయి. నైట్ మోడ్ లో ఎక్స్‌పోజర్ మెరుగ్గా, షార్ప్‌నెస్, నాయిస్ తక్కువగా ఉన్నాయి. డేలైట్ లో ఫ్రంట్ కెమెరా స్టన్నింగ్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇండోర్ కండీషన్స్ (లోలైట్) లో కెమెరా పనితీరు నాసీరకంగా ఉంది.
| బాగున్నవి | బాగాలేనివి |
| అద్భుతమైన డేలైట్ పనితీరు | ఎక్కువ వైబ్రంట్‌గా కనిపిస్తోన్న కలర్స్ |
| ఎఫెక్టివ్ నైట్ మోడ్ | బాగాలేని లో-లైట్ సెల్ఫీ పెర్ఫామెన్స్ |
| మంచి డే-లైట్ సెల్ఫీస్ | యావరేజీ క్వాలిటీ అల్ట్రావైడ్ లెన్స్ |
ఇతర స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
- చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో
- ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ
- బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్
Redmi Note 13 Pro
Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాతో తీసిన ఫోటోలు వైబ్రంట్ గా ఉన్నాయి. అయితే కాస్త ఆరెంజ్ వంటి కలర్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్, డైనమిక్ రేంజ్ బాగున్నాయి.
అయితే, లో-లైట్ కండీషన్స్ లో కలర్ కన్సిస్టెన్సీ బాగాలేదు. ఇమేజెస్ లో ఓవర్‌ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఉన్నాయి. అల్ట్రావైడ్ లెన్స్ కలర్ బ్యాలన్స్, ప్రైమరీ కెమెరాకు దాదాపు సమానంగా ఉంది. అయితే డీటెయిల్స్ బాగాలేవు. పొట్రెయిట్ షాట్స్ విషయంలో ఫోకస్ సమస్యగా ఉంది. ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్ లో బాగుంది. పొట్రెయిట్ మోడ్‌లో స్కిన్ టోన్ డిటెక్షన్ పర్ఫెక్ట్ గా లేదు.
| బాగున్నవి | బాగాలేనివి |
| మంచి డైనమిక్ రేంజ్ | సరిగ్గాలేని లో-లైట్ పనితీరు |
| ఏఐ ఎడిటింగ్ టూల్స్ | సరిగ్గాలేని స్కిన్ టోన్ డిటెక్షన్ |
| మంచి డేలైట్ సెల్ఫీస్ | అల్ట్రావైడ్ షాట్స్ లో డీటెయిల్స్ బాగా లేవు |
ఇతర స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
- చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
- ర్యామ్, స్టోరేజీ: 12జిబి వరకు ర్యామ్, 512జిబి స్టోరేజీ
- బ్యాటరీ, చార్జింగ్: 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ చార్జింగ్
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)









