OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • OnePlus Nord 4 బ్యాంక్ డిస్కౌంట్
  • రూ.3,000 వరకు తాత్కాలిక తగ్గింపు
  • మొత్తం ప్రయోజనం రూ.5,000

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

OnePlus Nord 4 ఆఫర్ వివరాలు

  • OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డులపై, 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
  • ఇవే కాకుండా, రూ.3,000 వరకు తాత్కాలిక ధర తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.5,000 వరకు తగ్గుతుంది.
  • ప్రస్తుతం ఈ ఆఫర్లు వన్‌ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ మరియు రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీతా మొబైల్స్, పై ఎలక్ట్రానిక్స్, బిగ్ సీ మొబైల్స్, లాట్ మొబైల్స్ తదితర స్టోర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.

OnePlus Nord 4 ధర వివరాలు

  • OnePlus Nord 4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • మెర్క్యూరియల్ సిల్వర్, ఒబ్సీడియన్ మిడ్నైట్ మరియు ఒయాసిస్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus Nord 4 5G లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 6.74-ఇంచ్ డిస్ప్లే, అల్ట్రా హెచ్డీఆర్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించారు.

ప్రాసెసర్: ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్‌తో లాంచ్ అయ్యింది.

మెమొరీ: OnePlus Nord 4 5G డివైజ్ 8జిబి/12జిబి యూఎఫ్ఎస్ 4.0 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OnePlus Nord 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇంచ్చారు. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ: OnePlus Nord 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, అలర్ట్ స్లైడర్, యూఎస్బీ టైప్-సీ 2.0, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord 4 5G తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.