అక్టోబర్ లో 5G సేవలు మొదలవుతాయి – టెలీకామ్ మినిస్టర్

హైలైట్స్:

  • అక్టోబర్ లో భారత్ లో మొదలు కానున్న 5జీ సేవలు, ఖరారు చేసిన టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్
  • తొలిదశలో కనీసం ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్న 5జీ సేవలు
  • ఈ ఏడాది ముగిసే లోపు 5జీ నెట్వర్క్ ని రోలౌట్ చేయనున్న ఎయిర్టెల్, జియో, వీఐ

5జీ స్పెక్ట్రమ్ మెగా ఆక్షన్ ఇటీవలె ముగిసింది. 1.56 లక్షల కోట్ల బిడ్డింగ్ జరిగింది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ పై అధిక పెట్టుబడి పెట్టిన జియో వేలంలో టాప్ బిడ్డర్ గా నిలిచింది. 700 మెగాహెర్ట్జ్ మంచి కాల్ క్వాలిటీ, ఓవరాల్ నెట్వర్క్ పెర్ఫామెన్స్ ని అందించనుంది. ఇక మరోవైపు శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ లతో జట్టుకడుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. అక్టోబర్ కల్లా ప్రభుత్వం 5జీ నెట్వర్క్ ని రోలౌట్ చేసేందుకు సంకల్పించిందని ఇండియా టుడే తెలిపింది.

అంటే ఈ ఏడాది ముగిసే లోపు 5జీ నెట్వర్క్ భారత్ లో అడుగు పెట్టడం ఖాయమని స్పష్టమవుతోంది. 4జీ కంటే 5జీ ప్లాన్స్ ధరలు ఎక్కువగా ఉండనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తొలినాళ్ళలో ఇలాగే ఉంటాయని తర్వాత సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 4జీ కంటే రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని 5జీ అందించనుంది.

అక్టోబర్ కల్లా భారత్ లో లాంచ్ కానున్న 5G Network

అక్టోబర్ నాటికి భారత్ లో 5జీ నెట్వర్క్ లాంచ్ కానుంది. టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ 5జీ రోలౌట్ గురించి మాట్లాడారు. “వేలం పూర్తైన తర్వాతి రోజే మా కమిటీ సెక్రటరీలు సమావేశమై, స్పెక్ట్రమ్ కేటాయింపులను అప్రూవ్ చేయడం జరిగింది. ఆగస్టు 10 వరకు స్పెక్ట్రమ్ కేటాయింపు పూర్తవుతుంది. తర్వాత ఎక్విప్మెంట్ ఏర్పాటు, ట్యూనింగ్ మిగతా పనులు అయిపోయాక, అక్టోబర్ లో 5జీ రోలౌట్ అవుతుంది.” అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

ఇక 5జీ సేవలు ముందుగా ఎక్కడ మొదలవుతాయో చూద్దాం. అనుకున్న సమాయానికి దేశంలో 5జీ సేవలు లాంచ్ అయినప్పటికీ, తొలి దశలో కేవలం ప్రధాన నగరాలకే రోలౌట్ పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తర్వాత మెల్లగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్వర్క్ విస్తరించనుంది. ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, చంఢీగర్, జామ్ నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పుణె, గాంధీ నగర్ వంటి నగరాల్లో తొలుత 5జీ సేవలు మొదలు కానున్నాయి.

ఏఆర్/వీఆర్, ఏఐ, హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్, తదితర సేవలు 5జీ నెట్వర్క్ ద్వారా యూజర్లకు అందనున్నాయి. 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2500 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ 5జీ ఫ్రీకెన్సీ బ్యాండ్స్ ప్రస్తుతం భారత్ లో అందుబాటులో ఉన్నాయి. 1.56 లక్షల కోట్ల బిడ్డింగ్ జరిగింది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ పై అధిక పెట్టుబడి పెట్టిన జియో వేలంలో టాప్ బిడ్డర్ గా నిలిచింది. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ మంచి కాల్ క్వాలిటీ, ఓవరాల్ నెట్వర్క్ పెర్ఫామెన్స్ ని అందించనుంది. ఇక మరోవైపు శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ లతో జట్టుకడుతున్నట్లు దిగ్గజ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ ప్రకటించింది.

Previous articleలాంచ్ అయిన Samsung Galaxy A23 5G
Next articleత్వరలో ఎంట్రీ ఇవ్వనున్న కొత్తతరం Hyundai Kona Electric SUV
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.