హైలైట్స్:
- ఆగస్టు 16 న లాంచ్ అవుతోన్న టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
- టొయోటా నుంచి వస్తున్న మొదటి సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ
- టెస్టింగ్ కోసం మారువేషంలో ఢిల్లీ రోడ్లపైకి వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ రీసెంట్ గా టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ను అన్వీల్ చేసింది. ఇది టొయోటా యొక్క తొలి సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న అర్బన్ క్రూజర్ హైరైడర్ ఆగస్టు 16 న లాంచ్ అవుతోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ని టొయోటా డీలర్షిప్స్ వద్ద లేదా టొయోటా అధికార వెబ్ సైట్ ద్వారా టోకెన్ అమౌంట్ రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఇక లాంచ్ కి ముందు టెస్ట్ రైడింగ్ కి వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఢిల్లీ రోడ్లపై కనిపించింది. మా యొక్క ఎక్స్క్లూజివ్ క్లిప్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, కారు వెడల్పుగా లేదు, చిన్న హెడ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ లేవు. మరి అర్బన్ క్రూజర్ హైరైడర్ ఇంకా ఏం ఆఫర్ చేస్తుందో చూద్దాం.
రోడ్లపై కనిపించిన Toyota Urban Cruiser Hyryder
పైన కనిపిస్తున్న క్లిప్ మనకు టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ యొక్క వెనుక భాగాన్ని చూపుతోంది. దీంతో కారు యొక్క వెడల్పు గురించి ఒక రఫ్ ఐడియా మనకు వస్తుంది. కారు పెద్దగా వెడల్పు ఉన్నట్లు అనిపించడం లేదు. అలాగే చిన్న హెడ్లైట్స్, ఫాగ్ ల్యాంప్ లేకపోవడం వంటివి మనం వీడియోలో గమనించవచ్చు.
ఇది వరకు టొయోటా కంపెనీ షేర్ చేసిన టీజర్స్ ద్వారా కారు రియర్ డిజైన్ ఎలా ఉందో తెలిసింది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ సిగ్నేచర్ శైలిలో హైలైట్ అవుతోంది. అలాగే ముందువైపు గ్రిల్ క్రోమ్ ప్లేటింగ్ ని కలిగి ఉంది. కారు లాంచ్ అయ్యాక ఫీచర్లు, ఇతర వివరాలు తెలియనున్నాయి. ఈలోపు టొయోటా నుంచి అర్బన్ క్రూజర్ హైరైడర్ కు సంబంధించిన ఏదైనా టీజర్ వచ్చే అవకాశముంది.
భారత్ లో Toyota Urban Cruiser Hyryder ధర (అంచనా)
టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ గ్రేడ్ తో వస్తోంది. ఎలక్ట్రిక్ డ్రైవ్ గేర్ బాక్స్, 1.5 లీటర్ ఇంజిన్ (టొయోటా హైబ్రిడ్ సిస్టమ్), 116 బీహెచ్పీ, 122 ఎన్ఎం టార్క్ ని హైరైడర్ కలిగి ఉంది. టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ లో ఈ-సీవీటీ ట్రాన్స్మిషన్ కూడా ఉంది.
భారత్ లో టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉండే అవకాశముంది. అర్బన్ క్రూజర్ హైరైడర్ ఆగస్టు 16 న లాంచ్ అవుతోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ని టొయోటా డీలర్షిప్స్ వద్ద లేదా టొయోటా అధికార వెబ్ సైట్ ద్వారా టోకెన్ అమౌంట్ రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.











