హైలైట్స్:
- త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న ఒప్పో ఏ57ఎస్ స్మార్ట్ ఫోన్
- ఇప్పటికే ఒప్పో ఏ57 4జీ స్మార్ట్ ఫోన్ ని భారత్ మరియు థాయిలాండ్ లో లాంచ్ చేసిన ఒప్పో
- ఒప్పో ఏ57ఎస్ యొక్క 4జీబీ ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,000 ఉండే అవకాశం
భారత్ లో మిడ్-రేంజ్ బయ్యర్లని టార్గెట్ చేస్తూ ఒప్పో త్వరలో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఒప్పో ఇప్పటికే ఒప్పో ఏ57ఎస్ స్మార్ట్ ఫోన్ ని భారత్ తో పాటు థాయిలాండ్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మరో స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఒప్పో ఏ57ఎస్ అనే పేరుతో భారత మార్కెట్లోకి ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. అయితే లాంచ్ కి ముందు ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్లు బయటకు వచ్చాయి. ఒప్పో నుంచి రానున్న ఒప్పో ఏ57ఎస్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లను ప్రముఖ టిప్ స్టర్ సుదాన్శు అంబోరే లీక్ చేశాడు. ఫీచర్లతో పాటు ఫోన్ యొక్క రెండర్లను కూడా సుదాన్శు బయటకు వదిలాడు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
OPPO A57s స్పెసిఫికేషన్స్
టిప్ స్టర్ సుదాన్శు అంబోరే ప్రకారం, ఒప్పో ఏ57ఎస్ స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ ఉండనుంది. ఇది హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్ కలిగి, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సైజ్ చూస్తే, 163.74 ఎంఎం పొడవు, 75.03 ఎంఎం వెడల్పు, 7.99 ఎంఎం మందం ఉండి 187 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఉండనుంది. 4జీ కనెక్టివిటీని ఈ ఫోన్ కలిగి ఉంది. 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఒప్పో ఏ57ఎస్ స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 8ఎంపి కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇంకా ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ అమర్చారు. దీంతో మాంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ యూజర్ కు దొరుకుతుంది. ఇక భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం జాక్, వై-ఫై 5గిగాహెర్ట్జ్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.
OPPO A57s ధర
ఒప్పో ఏ57ఎస్ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,000 గా ఉంటుందని అంచనా. త్వరలోనే ఒప్పో నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీ, ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.













