అద్భుతమైన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన BSNL

హైలైట్స్:

  • రెండు అదిరిపోయే రీచార్జ్ ప్లాన్లను బయటకు వదిలిన బీఎస్ఎన్ఎల్
  • రీచార్జ్ ప్లాన్ ధరలు వరుసగా రూ.2399 మరియు రూ.2999
  • ఈ రెండు ప్లాన్లతో లభించనున్న 75జిబి అదనపు డేటా; ఎయిర్టెల్, జియోలకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం

బీఎస్ఎన్ఎల్ పోర్ట్ ఫోలియోలో తక్కువ ధరలో బోలెడన్ని రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర కంపెనీలతో పోల్చితే ఇవి ఎంతో మెరుగైనవి. ఇదిలా ఉంటే, బీఎస్ఎన్ఎల్ మరిన్ని ప్లాన్స్ తో కస్టమర్లను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు యూజర్ల సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు మరో రెండు ప్లాన్స్ తో బీఎస్ఎన్ఎల్ ముందుకొచ్చింది. రూ.2399, రూ.2999 విలువ గల ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ 2022, ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్లాన్స్ తో అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నారు. అయితే ఆఫర్ ముగిసే లోపే రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. ఆఫర్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

BSNL నుంచి ఉత్తమమైన ఆఫర్

రూ.2399, రూ.2999 రీచార్జ్ ప్లాన్స్ తో బీఎస్ఎన్ఎల్ 75జిబి అదనపు డేటాను అందిస్తోంది. ఈ అదనపు డేటా కొరకు యూజర్ల నుంచి కంపెనీ ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జీలను వసూలు చేయదు. అయితే ఆగస్టు 31 లోపు రీచార్జి చేయాల్సి ఉంటుంది. ఏడాది పాటు వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఈ రెండు ప్లాన్స్ ఉత్తమమైనవి.

BSNL రూ.2999 రీచార్జ్ ప్లాన్

రూ.2999 రీచార్జ్ ప్లాన్ తో యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఇదే కాకుండా, ప్రతిరోజు 3జిబి డేటా లభిస్తుంది. అలాగే 75జిబి అదనపు డేటా ఎటువంటి చార్జీలు లేకుండా లభిస్తుంది. అంటే మొత్తంగా యూజర్లు 1170జిబి డేటాను పొందుతారు. ఇక ఈ ప్లాన్ లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు, పీఆర్బీటీ, ఇరోజ్ నౌ కి 30 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

BSNL రూ.2399 రీచార్జ్ ప్లాన్

రూ.2399 రీచార్జ్ ప్లాన్ తో యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే ప్రతిరోజు 2జిబి డేటా లభిస్తుంది. దాంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇతర బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఓటీటీ బెనిఫిట్ క్రింద, ఇరోజ్ నౌ ఓటీటీ కి 30 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ ను అందిస్తోంది. అలాగే యూజర్లు 75జిబి అదనపు డేటా ప్రయోజనం పొందుతారు. అంటే మొత్తంగా యూజర్లు 803 జిబి డేటాను పొందుతారు. అలాగే, పీఆర్బీటీ కి 30 రోజుల పాటు యాక్సెస్ ఉంటుంది.

రూ.2399, రూ.2999 విలువ గల ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ 2022, ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్లాన్స్ తో అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నారు. ఇతర నెట్వర్క్ లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను ఇస్తోన్న ఈ ఆఫర్లను చివరి తేదీ ముగిసే లోపే రీచార్జి చేసుకుని ప్రయోజనాలను పొందండి.

లేటెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ సమాచారం కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

Previous articleOscar నామినేషన్స్ బరిలో శ్యామ్ సింగ రాయ్
Next articleలాంచ్ కి ముందు లీకైన Vivo V25e స్పెసిఫికేషన్స్, రెండర్స్, కలర్ ఆప్షన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.