హైలైట్స్:
- త్వరలో భారత్ లో లాంచ్ కానున్న 5జీ సేవలు
- 5జీ నెట్వర్క్ లాంచ్ కి సిద్ధమవుతోన్న ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్
- 5జీ రీచార్జ్ ప్లాన్స్ ఎలా ఉంటాయో వెల్లడించిన ఎయిర్టెల్
Airtel 5జీ ప్లాన్స్ ధరలు: 5జీ వేలం నిర్వహించిన ప్రభుత్వం, టెలీకమ్ కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ ని కేటాయించడం జరిగింది. ఇక ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 5జీ సేవలను ప్రారంభిస్తాయని జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే, 5జీ సేవల లాంచ్ కంటే ముందు, అసలు జనాలు 5జీ రీచార్జ్ ప్లాన్స్ కొరకు ఎంత డబ్బులు వెచ్చించాలో అన్న దానిపై ప్రధానంగా చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఏ టెలీకామ్ సంస్థ కూడా దీనిపై పెదవి విప్పలేదు. కానీ, తాజాగా ఎయిర్టెల్ 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలపై ఓ స్పష్టతనిచ్చింది.
Airtel 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలు చౌకగా ఉంటాయా లేదా ఖరీదెక్కువుంటాయా?
మింట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతి ఎంటర్ప్రైజెస్ వైస్-చైర్మన్ అఖిల్ గుప్తా పలు విషయాలను వెల్లడించారు. తాము సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ కోసం జనాల దగ్గర నుంచి ప్రీమియమ్ చార్జీలు వసూలు చేయమని, కానీ హయ్యర్ ప్రైస్ కలిగిన టారిఫ్స్ ఉండటం కస్టమర్లు గమనిస్తారని అఖిల్ గుప్తా వెల్లడించారు. అంటే ఎయిర్టెల్ 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఎక్కువగా ఉంటాయని అర్థమవుతోంది.
“5జీ సేవలు చాలా విస్తృతమవుతాయి. ఎవరి దగ్గరైతే 5జీ హ్యాండ్సెట్ ఉంటుందో వారికి 5జీ నెట్వర్క్ అందుతుంది. వారు ఎక్కువ మొత్తం 5జీ వాడకం చేస్తారు. తద్వారా ఆటోమేటిక్ గా హయ్యర్ టారిఫ్ ప్లాన్ కి మారుతారు. దీంతో అత్యధిక లాభాలు పుట్టుకొస్తాయి,” అని అఖిల్ గుప్తా చెప్పారు. స్వచ్ఛమైన 5జీ ని మించింది మరొకటి ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కాస్త ఎక్కువ ఖరీదైన టారిఫ్ తో 5జీ సేవలు మొదలవుతాయని అఖిల్ గుప్తా అన్నారు.
5G స్పెక్ట్రమ్ కోసం 4 ఏళ్ళ ముందస్తు చెల్లింపు చేసిన Airtel
దేశంలో త్వరగా 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ ఇటీవలె కీలకమైన అడుగు వేసింది. టెలీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఎయిర్టెల్ 4 ఏళ్ళ అడ్వాన్స్ పేమెంట్ చేసింది. నాలుగేళ్ళ కాలానికి గాను, ఎయిర్టెల్ మొత్తం రూ.8312 కోట్లు చెల్లించింది.
5జీ వేలం ముగిశాక, స్పెక్ట్రమ్ కొరకు మిగతా నగదుని 19 ఏళ్ళ సమయంలో విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం ఎయిర్టెల్ కు తెలిపింది. అయితే ఎయిర్టెల్ తన ప్లాన్ లో భాగంగా, ఒకేసారి రూ.8312 కోట్లు చెల్లించింది. ఎయిర్టెల్ సంస్థ 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ తో పాటు, 3.5 జీపీఎస్ బ్యాండ్, 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ లో పెట్టుబడి పెట్టింది. ఈ బ్యాండ్స్ ప్రత్యేకత ఏంటంటే, తక్కువ ధరలో 100 రెట్లు మెరుగైన కవరేజీని అందిస్తాయి.
లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్, ఓటీటీ వార్తలకై 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.













