హైలైట్స్:
- రియల్ మీ ఇండియా, చైనా వెబ్ సైట్స్ లో కనిపించిన రియల్ మీ జీటీ నియో 4
- రియల్ మీ జీటీ నియో 3 కి సక్సెసర్ గా వస్తున్న రియల్ మీ జీటీ నియో 4
- ఇంకా రివీల్ కాని రియల్ మీ జీటీ నియో 4 లాంచ్ డేట్
మార్చి లో చైనాలో రియల్ మీ జీటీ నియో 3 లాంచ్ అయ్యింది. జీటీ నియో 2 కి సక్సెసర్ గా ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు రియల్ మీ జీటీ నియో 3 కి సక్సెసర్ ని లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ చెబుతున్న దాన్ని బట్టి, కంపెనీ యొక్క చైనా, ఇండియా వెబ్ సైట్స్ లో రియల్ మీ జీటీ నియో 4 ఫోన్ కనిపిస్తోందని తెలుస్తోంది.
అయితే, నియో 4 యొక్క స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు. రియల్ మీ జీటీ నియో 3 కి పలు మార్పులు చేర్పులు చేసిన నియో 4 ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే నియో 3 కంటే నియో 4 లో స్పెసిఫికేషన్స్ పరంగా, డిజైన్ పరంగా చాలా మార్పులను మనం గమనించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలను మనం తెలుసుకునే అవకాశముంది.
So the Realme GT Neo4 has been listed on the company's official website (China, India).#Realme #RealmeGTNeo4 pic.twitter.com/8CiT6aW3OL
— Mukul Sharma (@stufflistings) August 24, 2022
Realme GT Neo 3 స్పెసిఫికేషన్స్
రియల్ మీ జీటీ నియో 3 లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10 బిట్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్ మీ జీటీ నియో 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్ మీ జీటీ నియో 3 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో కూడిన మరొక వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, జీటీ మోడ్ 3.0, 39606 ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్ మీ జీటీ నియో 4 కి సంబంధించిన లాంచ్ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. రియల్ మీ కంపెనీ, రానున్న రోజుల్లో నియో 4 యొక్క టీజర్ ఇమేజెస్ షేర్ చేసే అవకాశముంది. అప్పుడు ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు ఏమైనా తెలిసే అవకాశముంది.












