iQOO Z6 Lite: లాంచ్ తేదీ, లభ్యత కన్ఫర్మ్

హైలైట్స్:

  • సెప్టెంబర్ 14 న భారత్ లో లాంచ్ కానున్న iQOO Z6 Lite
  • 5జీ కనెక్టివిటీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాస్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • iQOO Z6 Lite స్నాప్ డ్రాగన్ 4-సిరీస్ చిప్సెట్ తో వచ్చే అవకాశం

iQOO Z6 సిరీస్ ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి కంపెనీ కొత్త వేరియంట్స్ ని లాంచ్ చేస్తూ పోతోంది. ఇప్పటికి ఈ సిరీస్ లో ఐకూ జెడ్6, ఐకూ జెడ్6 5జీ, ఐకూ జెడ్6 44వాట్, ఐకూ జెడ్6 ప్రో 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రీసెంట్ గా చైనాలో ఐకూ జెడ్6ఎక్స్, ఐకూ జెడ్6 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఐకూ నుంచి ఈ సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ అవుతోంది. అదే iQOO Z6 Lite. ఈ హ్యాండ్సెట్ సెప్టెంబర్ 14 న భారత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇతర ఐకూ ఫోన్స్ మాదిరి, ఐకూ జెడ్6 లైట్ కూడా అమెజాన్ ద్వారా విక్రయించబడనున్నాయి.

అమెజాన్ లో ఈ ఫోన్ కి సంబంధించిన డెడికేటెడ్ మైక్రోసైట్ ని మనం గమనించవచ్చు. దీని ద్వారా iQOO Z6 Lite యొక్క ముఖ్యమైన ఫీచర్లు మనకు తెలుస్తున్నాయి. చూస్తుంటే, ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా కనిపించడం లేదు. iQOO Z6 Lite బ్రాండ్ న్యూ ఫోన్ అని స్పష్టమవుతోంది.

iQOO Z6 Lite స్పెసిఫికేషన్స్

iQOO Z6 Lite సెప్టెంబర్ 14 న భారత్ లో లాంచ్ అవుతోంది. హ్యాండ్సెట్ డిజైన్ ఐకూ జెడ్6 5జీ ఫోన్ ని పోలి ఉంది. ఇక iQOO Z6 Lite లో వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ స్లిమ్ బెజెల్స్, ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది. ఫోన్ బాక్సీ డిజైన్ ని కలిగి ఉంది. ఇటీవల వస్తున్న అన్ని ఫోన్లు ఇదే డిజైన్ ని ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. ఫోన్ నిర్మాణం విషయానికి వస్తే, ఇది పాలీకార్బొనేట్ మెటీరియల్ తో తయారైంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ని అమర్చారు.

iQOO Z6 Lite వెనుకాల రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో రెండు భారీ రింగ్స్ కనిపిస్తున్నాయి. ఇందులోని టాప్ రింగ్ లో ప్రైమరీ కెమెరా, క్రింద రింగ్ లో మరొక సెన్సర్ ఉంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్, 5జీ బ్రాండింగ్ కనిపిస్తున్నాయి.

iQOO Z6 Lite 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుందని, అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లో ప్యానెల్ ఎల్సీడీ లేదా అమోలెడ్ లలో దేంతో తయారైందో ఇంకా తెలియదు. ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, డ్యూయల్ 5జీ కనెక్టివిటీ తో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. అయితే, ఇంకా చిప్సెట్ వివరాలు ఇంకా తెలియదు. ఐకూ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ చిప్ తో ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం.

సెప్టెంబర్ 7 న iQOO Z6 Lite యొక్క చిప్సెట్ వివరాలు తెలుస్తాయని అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అంటే, అతి త్వరలో మనకు మరిన్ని వివరాలు తెలియనున్నాయి.