హైలైట్స్:
- ఇటీవలె గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన Moto Edge 30 Ultra, సెప్టెంబర్ 13 న భారత్ లో ఎంట్రీకి రెడీ
- Moto Edge 30 Ultra ప్రపంచపు తొలి 200ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ ఫోన్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ర్యామ్, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
సెప్టెంబర్ 13 న భారత మార్కెట్ లో Moto Edge 30 Ultra లాంచ్ అవుతుందని మోటోరోలా సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ డివైజ్ ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ గా పిలవబడుతోంది. రీసెంట్ గా ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలె చైనాలో లాంచ్ అయిన మోటోరోలా ఎక్స్30 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క రీబ్రాండ్ వర్షన్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా వచ్చింది. లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 125వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
Moto Edge 30 Ultra ఇండియా లాంచ్ తేదీ, ధర
Introducing the all-new #motoroaledge30ultra! The World’s First* 200MP Camera Smartphone gives Unmatched Resolution & Unmatched Picture Quality. Experience the fastest Snapdragon 8+ Gen1, 125W charging & more. Launching 13th Sept. on @Flipkart and retail stores!
— Motorola India (@motorolaindia) September 9, 2022
సెప్టెంబర్ 13 న Moto Edge 30 Ultra భారత్ లో లాంచ్ కానుంది. గతవారంలో ఈ ఫ్లాగ్షిప్ భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేశారు. కానీ ఎందుచేతనో లాంచ్ కాలేదు. దీంతో ఇప్పుడు మరో తేదీని కంపెనీ ప్రకటించింది. లాంచ్ కోసం మోటోరోలా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
899.99 యూరోలు (రూ.72,900) తో Moto Edge 30 Ultra గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. అదే ధరతో లేదంటే కాస్త తక్కువ ధరకి భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్స్ ద్వారా Moto Edge 30 Ultra ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్
Moto Edge 30 Ultra లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1250 నిట్స్ బ్రైట్నెస్, డీసీ డిమ్మింగ్, 1500హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, ఫుల్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
Moto Edge 30 Ultra లో 200 ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. Moto Edge 30 Ultra లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ట్రిపుల్ మైక్రోఫోన్ సిస్టమ్, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












