హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన Realme Narzo 50i Prime
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ చార్జింగ్ స్పీడ్, ఆండ్రాయిడ్ 11 ఎస్, రియల్మీ ఆర్ యూఐ కస్టమ్ స్కిన్, యూనిసాక్ టీ612 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- Realme Narzo 50i Prime ధర రూ.7,999 నుంచి ప్రారంభం

భారత్ లో Realme Narzo 50i Prime అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. జూన్ లో చైనాలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు భారత గడ్డపై అడుగు పెట్టింది. నార్జో 50 సిరీస్ లో ఇది ఆరవ ఫోన్. ఇదివరకు నార్జో సిరీస్ లో రియల్మీ నార్జో 50 ప్రో 5జీ, నార్జో 50 5జీ, నార్జో 50ఏ ప్రైమ్, నార్జో 50, నార్జో 50ఐ, నార్జో 50ఏ అనే ఫోన్లు వచ్చాయి. వాటర్ డ్రాప్ నాచ్, సింగిల్ రియర్ కెమెరా సెన్సర్, యూనిక్ ప్యాటెర్న్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.
Realme Narzo 50i Prime 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ స్పీడ్, ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ ఆర్ యూఐ కస్టమ్ స్కిన్, 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, సన్నని బెజెల్స్ ని కలిగి ఉంది.
భారత్ లో Realme Narzo 50i Prime ధర, లభ్యత
Realme Narzo 50i Prime 3జిబి + 32జిబి మోడల్ ధర రూ.7,999. 4జిబి + 64జిబి ధర రూ.8,999 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది. అవి: డార్క్ బ్లూ, మింట్ గ్రీన్. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. రియల్మీ వెబ్సైట్, ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా కూడా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
Realme Narzo 50i Prime స్పెసిఫికేషన్స్
Realme Narzo 50i Prime 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, యూనిసాక్ టీ612 చిప్, మాలి-జీ57 జీపీయూ గ్రాఫిక్స్, 3జిబి/4జిబి ర్యామ్, 32జిబి/64జిబి స్టోరేజీ, 1టీబీ ఎక్స్టెండబుల్ మెమొరీ (via SD card) వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత రియల్మీ-బేస్డ్ ఆర్ ఎడిషన్ కస్టమ్ స్కిన్ తో వస్తోంది. Realme Narzo 50i Prime లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 4జీ వోల్టీ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/గ్లొనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ 164.1 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 182 గ్రాముల బరువు ఉంటుంది.
ఇప్పుడు Realme Narzo 50i Prime కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరా ఉంది.












