హైలైట్స్:
- నేడు భారత్ లో లాంచ్ అయిన OPPO F21s Pro సిరీస్
- ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా నేటి నుంచి ఈ ఫోన్లను కొనే అవకాశం, సెప్టెంబర్ 19 నుంచి డెలివరీ ప్రారంభం
- 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 695 చిప్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ OPPO F21s Pro 5G యొక్క ప్రధాన ఫీచర్లు
OPPO నుంచి నేడు భారత్ లో ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో OPPO F21s Pro 4G, OPPO F21s Pro 5G ఫోన్లు ఉన్నాయి. ఈ సిరీస్ ఒప్పో ఎఫ్19ఎస్ సిరీస్ కి అప్గ్రేడ్ వర్షన్ అని అనుకోవచ్చు. గత కొన్నాళ్ళుగా ఒప్పో నుంచి వస్తున్న ఫోన్ల స్పెసిఫికేషన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. ఎందుకంటే OPPO F21s Pro 5G ఫీచర్లు, OPPO Reno 8Z ని పోలి ఉన్నాయి. మరోవైపు OPPO F21s Pro 4G ఫీచర్లు OPPO F21 Pro ని పోలి ఉన్నాయి. ఏదేమైతేనేమీ, ఓసారి OPPO F21s Pro సిరీస్ హ్యాండ్సెట్స్ పై ఓ లుక్ వేద్దాం పదండి.
భారత్ లో OPPO F21s Pro 4G and OPPO F21s Pro 5G ఫోన్ల ధర
భారత్ లో ఒప్పో ఎఫ్21ఎస్ 5జీ ఫోన్ ధరను రూ.25,999 గా నిర్ణయించారు. ఇది రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: స్టార్లైట్ బ్లాక్, డాన్లైట్ గోల్డ్. మరోవైపు, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రో 4జీ ఫోన్ ధర రూ.22,999 గా ఉంది. ఇది కూడా సేమ్ కలర్ ఆప్షన్స్ ని కలిగి ఉంది. నేటి నుంచి ఈ ఫోన్లు ఒప్పో అధికార వెబ్ సైట్ ద్వారా సేల్ కి వచ్చాయి. సెప్టెంబర్ 19 నుంచి ఫోన్ల షిప్పింగ్ మొదలవుతుంది. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా రూ.2500 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
OPPO F21s Pro 5G స్పెసిఫికేషన్స్
OPPO F21s Pro 5G లో 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 409పీపీఐ, 600 నిట్స్ బ్రైట్నెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్ వూక్ చార్జింగ్, 128జిబి స్టోరేజీ 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్, 64ఎంపి ఈఐఎస్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ ఉన్నాయి.
OPPO F21s Pro 4G స్పెసిఫికేషన్స్
OPPO F21s Pro 4G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మెమొరీ కార్డ్ స్లాట్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












