Vivo Y52T బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన Vivo

హైలైట్స్:

  • కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y52T ని లాంచ్ చేసిన వివో
  • చైనాలో మాత్రమే లాంచ్ అయిన Vivo Y52T స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్న Vivo Y52T

వివో కంపెనీ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Vivo Y52T ని చైనాలో లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ విడుదలైన ఈ ఫోన్ Vivo Y52 కి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఈ ఫోన్ ని చైనీస్ బ్రాండ్ వివో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరాలు తదితర ఫీచర్లు ఉన్నాయి. భారత్ లో Vivo Y52T లాంచ్ కి సంబంధించిన వివరాలను వివో తెలపలేదు. త్వరలోనే వివో నుంచి ఏదైనా టీజర్ ఇమేజ్ వస్తుందేమో చూడాలి. లేదంటే, చైనాలో లాంచ్ చేసినట్లుగానే సైలెంట్ గా భారత్ లో కూడా లాంచ్ చేస్తుందోమో వేచి చూడాలి.

Vivo Y52T ధరలు

Vivo Y52T ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధరను CNY 1299 (రూ.14,800) గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1499 (దాదాపు రూ.17000) గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: పీచ్, బ్లూ, బ్లాక్. సెప్టెంబర్ 19 నుంచి చైనాలో సేల్ మొదలవుతుంది.

Vivo Y52T స్పెసిఫికేషన్స్

Vivo Y52T లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అందించారు. హెచ్డీ+ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇందులో ఉన్నాయి. Vivo Y52T లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ అమర్చారు. ఇది 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మెమొరీ కార్డ్ స్లాట్ (1టీబీ) కలిగి ఉంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo Y52T డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 13ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరాను అమర్చారు.

గతేడాది Vivo Y52 5G ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. తాజాగా Vivo Y52T ఫోన్ ని దానికి సక్సెసర్ గా వివో లాంచ్ చేసింది. Vivo Y52 5G స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్లో 6.58-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 4జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

చూస్తుంటే రెండు ఫోన్లలో దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి Vivo Y52T స్మార్ట్ ఫోన్ ని వివో భారత్ లో లాంచ్ చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ చేస్తే కనుక దీని ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleసెప్టెంబర్ 28 న లాంచ్ అవుతోన్న Tata Tiago EV
Next articleఅమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: రూ.40,000 లోపు iPhone 12
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.