హైలైట్స్:
- చైనాలో లాంచ్ అయిన మడతబెట్టే ఫోన్ Vivo X Fold+
- 6.53-ఇంచ్ కవర్ డిస్ప్లే, 8-ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే తో లాంచ్ అయిన Vivo X Fold+
- Vivo X Fold కి సక్సెసర్ గా వచ్చిన Vivo X Fold+ స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ Vivo X Fold+ ని లాంచ్ చేసింది. 2కే ఫోల్డబుల్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం Vivo X Fold+ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయ్యింది. మరి వివో సంస్థ ఈ ఫోన్ ని భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ కి తీసుకొస్తుందో లేదో చూడాలి.
Vivo X Fold+ ధర, లభ్యత
CNY 9,999 ప్రారంభ ధరతో Vivo X Fold+ (12జిబి ర్యామ్+256జిబి స్టోరేజీ) లాంచ్ అయ్యింది. మన కరెన్సీలో దాదాపు రూ.1,13,600. ఇకపోతే, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 10,999 (దాదాపు రూ.1,25,000) గా నిర్ణయించారు. ఈ ఏడాది ప్రథమార్థంలో లాంచ్ అయిన Vivo X Fold కంటే Vivo X Fold+ ధర CNY 1,000 (దాదాపు రూ.11,300) ఎక్కువగా ఉంది.
Vivo X Fold+ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 29 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే దొరుకుతోంది. ఇతర మార్కెట్స్ లో ఫోన్ విడుదల అవుతుందా లేదా ఇంకా తెలియదు. క్లియర్ మౌంటెయిన్ బ్లూ, సైకమోర్ ఆష్, హుఆక్సియా రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభించనుంది. ఇంకా ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పూర్తిగా ఫాక్స్ లెదర్ ఫినిష్ ని కలిగి ఉంది.
Vivo X Fold+ స్పెసిఫికేషన్స్
Vivo X Fold+ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ 6.53-ఇంచ్ బయటి డిస్ప్లే, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని కలిగి ఉంది. ఫోన్ లోపల చూస్తే, 8-ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే, అల్ట్రా-థిన్ గ్లాస్, 1హెర్ట్జ్ నుంచి 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించే ఎల్టీపీవో టెక్నాలజీ ఉన్నాయి. Vivo X Fold+ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
Vivo X Fold+ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Zeiss బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు Vivo X Fold+ లో 16ఎంపి కెమెరా అందించారు.
Vivo X Fold+ లో 4,730 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. గత మోడల్ అయిన Vivo X Fold లో 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అందించారు. Vivo X Fold+ ఫోన్ కేవలం 35 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.











