లీకైన Infinix Zero Ultra 5G లైవ్ ఇమేజెస్: అదిరిపోయిన లుక్

హైలైట్స్:

  • అక్టోబర్ 5 న గ్లోబల్ గా లాంచ్ కానున్న Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్
  • కర్వ్డ్ స్క్రీన్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్న Infinix Zero Ultra 5G
  • బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Infinix Zero Ultra 5G

అక్టోబర్ 5 న Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ఇటీవలె Infinix కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. లాంచ్ ఈవెంట్ కి ముందు ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్, రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Newzonly, పారస్ గుగ్లాని ద్వారా ఇవి బయటకు వచ్చాయి. ఇకపోతే కొన్ని స్పెసిఫికేషన్స్ ఈ నెల మొదట్లోనే లీక్ అయ్యాయి.

Infinix Zero Ultra 5G లాంచ్ కోసం రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్‌విచ్ తో తమ కార్పొరేట్ పార్ట్నర్షిప్ ని రెనివల్ చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. లండన్ లోని గ్రీన్‌విచ్ లో నాలుగు మ్యూజియమ్స్ కలిగిన కంపెనీయే ఈ రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్ విచ్. ఈ కంపెనీ యొక్క మ్యూజియమ్ అయిన రాయల్ అబ్జర్వేటరీ, గ్రీన్‌విచ్ కి ప్రైమ్ మెరిడియన్ గా ప్రాముఖ్యత ఉంది. సున్నా డిగ్రీల రేఖాంశం ఈ మ్యూజియమ్ గుండా వెళ్తుంది.

లైవ్ ఇమేజెస్ ద్వారా Infinix Zero Ultra 5G పంచ్-హోల్ కటౌట్, బాటమ్ బెజెల్స్ రివీల్ అయ్యాయి. ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి ఉంది. 200ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. వైట్, బ్లాక్ కలర్ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుందని రెండర్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు ఇన్ఫినిక్స్ వద్ద ఉన్న ఫాస్టెస్ట్ చార్జింగ్ టెక్నాలజీ 180 వాట్ థండర్ చార్జ్ సిస్టమ్ ని Infinix Zero Ultra 5G లో వాడారు. మరి త్వరలో లాంచ్ కానున్న Infinix Zero Ultra 5G నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Infinix Zero Ultra 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ ఉండనుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. Infinix Zero Ultra 5G 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ద్వారా 3జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

Infinix Zero Ultra 5G లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. ఈ ఫోన్ కి ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మిడ్-రేంజ్ ఫోన్లో కర్వ్డ్ డిస్ప్లేను అందిస్తోన్న ఫోన్లు ఒకట్రెండుకి మించి లేవు. కాబట్టి ఈ భారీ కర్వ్డ్ డిస్ప్లే ఈ ఫోన్ కి మంచి సెల్లింగ్ పాయింట్ అవుతుంది. అలాగే ఇందులో 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది కూడా Infinix Zero Ultra 5G ఫోన్ ని ఓ మెట్టు పైనే నిలబెడుతుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Zero Ultra 5G లో 200ఎంపి భారీ కెమెరా ఉంది. ఇది ఈ ఫోన్ కే హైలైట్ ఫీచర్ అని చెప్పాలి. అందుబాటు ధరలో 200ఎంపి కెమెరా ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంకా ఇందులో 8ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

లాంచ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ Infinix Zero Ultra 5G కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు తెలిసే అవకాశం ఉంది.

Previous article2K ఫోల్డబుల్ ప్యానెల్, Snapdragon 8+ Gen 1 చిప్ తో లాంచ్ అయిన Vivo X Fold+
Next article7000mAh బ్యాటరీ, Helio G85 చిప్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 2
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.