రూ.6099 ధరతో లాంచ్ అయిన Tecno POP 6 Pro

హైలైట్స్:

  • నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్
  • కేవలం రూ.6099 కే లభించనున్న Tecno POP 6 Pro, అమెజాన్ ద్వారా లభ్యం కానున్న హ్యాండ్సెట్
  • 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వస్తున్న Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్

కొన్ని రోజుల క్రితం 91మొబైల్స్ Tecno POP 6 Pro లాంచ్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వార్తను ప్రచురించింది. సరిగ్గా ఇప్పుడు అదే నిజమైంది.లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్లను లాంచ్ చేసే టెక్నో నుంచి తాజాగా Tecno POP 6 Pro భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.6099 కి Tecno POP 6 Pro ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Tecno POP 6 Pro ధర

Tecno POP 6 Pro కేవలం సింగిల్ వేరియంట్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధరను టెక్నో కంపెనీ రూ.6,099 గా నిర్ణయించింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. పీస్ఫుల్ బ్లూ, పోలార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక్కడొక బండిల్ ఆఫర్ ఉంది అందేంటో తెలుసుకుందాం. Tecno POP 6 Pro కొనుగోలుతో పాటు, కేవలం రూ.399 అదనంగా చెల్లిస్తే, మీరు Boat Bassheads ని సొంతం చేసుకోవచ్చు.

Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్

Tecno POP 6 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పిక్సెల్స్ పర్ ఇంచ్, డాట్ నాచ్ స్టైల్ డిస్ప్లే, 2.5డి గ్లాస్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.75 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Tecno POP 6 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ అమర్చారు. ఇది 2 గిగా హెర్ట్జ్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 2జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32జిబి ఈఎంఎంసీ5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

Tecno POP 6 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి కెమెరా ఉంది.

Tecno POP 6 Pro డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో 4g, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ, బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్లో ఫేస్ అన్-లాక్ ఫీచర్ అందించారు. Tecno POP 6 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 42 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. చాలా తక్కువ బడ్జెట్ లో 4జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ నచ్చితే.. సాధారణ వాడకానికి Tecno POP 6 Pro ఫోన్ బాగా పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous article7000mAh బ్యాటరీ, Helio G85 చిప్ తో లాంచ్ అయిన Tecno Pova Neo 2
Next articleApple దీపావళి సేల్ ఆఫర్: రూ.7,000 వరకు లభించనున్న డిస్కౌంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.