హైలైట్స్:
- భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Google Pixel 7, Google Pixel 7 Pro
- టెన్సర్ జీ2 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 11ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయిన Pixel 7 సిరీస్ ఫోన్లు
- అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి మొదలైన పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్
![]()
Google Pixel 7, Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్లు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. 2018 లో పిక్సెల్ 3 లాంచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే గూగుల్ సంస్థ తన ఫ్లాగ్షిప్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన పిక్సెల్ 6 కి పిక్సెల్ 7 సిరీస్ సక్సెసర్. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, అల్యూమినియమ్ ఫినిషింగ్ తో అడ్డంగా అమరిన కెమెరా మాడ్యూల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్సెట్ తో ఈ ఫోన్లు వచ్చాయి.
భారత్ లో Google Pixel 7, Google Pixel 7 Pro ధర, ప్రీ-ఆర్డర్ వివరాలు
భారత్ లో Google Pixel 7 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఈ ఫోన్ స్నో, అబ్సీడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Google Pixel 7 Pro 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.84,999 గా నిర్ణయించారు. అబ్సీడియన్, స్నో, హేజల్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు విక్రయానికి వస్తాయి. అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి Fitbit Inspire 2 ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
![]()
Google Pixel 7 స్పెసిఫికేషన్స్
Google Pixel 7 లో 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, సిమెట్రికల్ బెజెల్స్, షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. పిక్సెల్ 7 లో గూగుల్ టెన్సర్ జీ2 చిప్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. పిక్సెల్ 7 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని గూగుల్ అందిస్తుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్, టైటన్ సెక్యూరిటీ చిప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వైర్లెస్ చార్జింగ్ Google Pixel 7 లో ఉన్నాయి.
Google Pixel 7 లో 50ఎంపి ప్రైమరీ, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 11ఎంపి కెమెరా ఉంది. ఈ ఫోన్లో హై-రెజుల్యూషన్ 8x జూమ్, రియల్-టోన్, మూవీ మోషన్ బ్లర్ అనే ఫీచర్లు ఉన్నాయి.
Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్
Google Pixel 7 Pro లో 6.7-ఇంచ్ ఎల్టీపీవో క్యూహెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టెన్సర్ జీ2 చిప్సెట్ ఉన్నాయి. 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై Google Pixel 7 Pro పని చేస్తుంది.
Google Pixel 7 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంది. ఇది 5x ఆప్టికల్ జూమ్ మరియు ఎల్టీఏఎఫ్ ని కలిగి ఉంది. అలాగే 50ఎంపి ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది. మరొక 12ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 11 ఎంపి కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 4కే వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Google Pixel 7 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ తో వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











