లాంచ్ కి ముందు లీకైన Lava Storm, Lava Storm Pro స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Lava Storm సిరీస్
  • 5జీ కనెక్టివిటీ తో రానున్న Lava Storm Pro వర్షన్
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, మీడియాటెక్ చిప్సెట్, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా

గత కొన్నేళ్ళుగా దేశీయ కంపెనీ Lava తన మార్కెట్ భాగాన్ని చైనాకు చెందిన బ్రాండ్స్ కి కోల్పోతూ వస్తోంది. అయితే లావా కంపెనీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకు తగినట్లుగానే ఇటీవలి కాలంలో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. రీసెంట్ గా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్ లో లావా కంపెనీ Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఐటీ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ ఈ ఫోన్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రైస్ బాబా లో వచ్చిన తాజా కథనం లావా నుంచి రాబోవు ఫోన్ల వివరాలను తెలిపింది. ఆ రిపోర్ట్ ప్రకారం, త్వరలోనే లావా నుంచి Lava Storm సిరీస్ మార్కెట్ లోకి లాంచ్ కాబోతున్నట్లు అర్థమవుతోంది.

Lava Storm సిరీస్ విశేషాలు

Pricebaba ప్రకారం, Lava Storm సిరీస్ 5జీ మరియు 4జీ వేరియంట్స్ ని కలిగి ఉండనుంది. ఎంట్రీ లెవెల్ Lava Storm స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీ తో వస్తోంది. మరోవైపు Lava Storm Pro 5జీ కనెక్టివిటీ తో వస్తోంది. తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్ గా Lava Storm Pro నిలవనుంది.

ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే, Lava Storm Pro, మరొక లో-బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ అయిన Lava Blaze సరసన చేరుతుంది. ఇకపోతే Lava Storm సిరీస్ ఫోన్ల ధరలు రూ.10,000 లోపు ఉంటాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళి పండుగ వీకెండ్ లో Lava Storm Pro 5జీ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. తర్వాత క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ని క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఈ టైమ్ ని ఎంచుకుంది.

Lava Storm సిరీస్ స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Lava Storm సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Lava Storm సిరీస్ ఫోన్లు మీడియాటెక్ చిప్స్, 50 మెగా పిక్సెల్ కెమెరాలతో రానున్నాయని తెలుస్తోంది. ప్రో వేరియంట్ విషయానికి వస్తే, ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే మరే ఇతర ఫీచర్లు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం Lava యొక్క Agni 5G ఫోన్ ఒక్కటే 5జీ పోర్ట్ ఫోలియో ని భర్తీ చేస్తోంది. ఇక మీదట వరుసగా లాంచ్ కానున్న 5G ఫోన్లతో ఈ పరిస్థితి మారనుంది. Lava Agni 5G ధర రూ.17,999 గా ఉంది.

చూస్తుంటే Lava కంపెనీ మళ్ళీ తన మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. సదరు సంస్థ ఆవైపుగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. దేశీ కంపెనీ అయిన లావా పుంజుకోవాలని కోరుకుందాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleఅక్టోబర్ 14 న లాంచ్ కానున్న Redmi A1+ స్మార్ట్ ఫోన్
Next article‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీ OTT Update
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.