64MP కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచ్ అయిన Samsung Galaxy M32 Prime Edition

హైలైట్స్

  • Galaxy M32 Prime Edition ని మార్కెట్ లో లాంచ్ చేసిన శాంసంగ్
  • 64ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • దీపావళి పండుగ ఆఫర్ లో భాగంగా రూ.10,999 కి అమెజాన్ లో లభిస్తోన్న ఫోన్

Samsung కంపెనీ భారత మార్కెట్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. Galaxy M32 Prime Edition భారత్ లో లాంచ్ అయ్యింది. దీపావళి పండుగ సీజన్ లో వచ్చిన ఈ ఫోన్ ఆకర్షణీయమైన ధరలో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో దీపావళి ఆఫర్ క్రింద ఈ ఫోన్ రూ.10,999 కి లభిస్తోంది. Galaxy M32 Prime Edition లో 64 మెగా పిక్సెల్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy M32 Prime Edition స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M32 Prime Edition లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డిజైన్ ని శాంసంగ్ ఇన్ఫినిటీ యూ అని పిస్తోంది. ఇకపోతే డిస్ప్లే 800 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని కలిగి ఉంది.

Samsung Galaxy M32 Prime Edition యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20 మెగా పిక్సెల్ షూటర్ ని అమర్చారు.

Samsung Galaxy M32 Prime Edition ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ80 చిప్సెట్ అమర్చారు. ఇదొక ఆక్టాకోర్ ప్రాసెసర్. ఈ చిప్ 2 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఈ శాంసంగ్ డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది.

Samsung Galaxy M32 Prime Edition ఒక 4జీ ఫోన్. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్, వైఫై తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు. ఈ స్కానర్ పవర్ బటన్ లో ఎంబెడ్ చేయబడి ఉంటుంది. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy M32 Prime Edition ధర

Samsung Galaxy M32 Prime Edition భారత్ లో 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. 6జిబి మోడల్ ధర రూ.13,499 గా ఉంది. అమెజాన్ ఇండియా లో ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.