3C సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయిన Xiaomi 13 ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన Xiaomi 13
  • ఎంఐయూఐ 14, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాస్, 50వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Xiaomi 13
  • ఈ ఏడాది Xiaomi 13 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం

Xiaomi 12 కి సక్సెసర్ గా త్వరలోనే Xiaomi 13 మార్కెట్ లోకి రానుందని సమాచారం. ప్రస్తుతం షావోమీ సంస్థ ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ లైనప్ లో రెండు మోడల్స్ ఉంటాయి. అవి: Xiaomi 13, Xiaomi 13 Pro. ఈ రెండు ఫోన్లు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తాయని సమాచారం. నవంబర్ లో Xiaomi 13 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె నెట్టింట్లో ప్రత్యక్షమైన లైవ్ ఇమేజ్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. చూస్తుంటే షావోమీ 11 అల్ట్రా డిజైన్ మాదిరి Xiaomi 13 డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు Xiaomi 13 సిరీస్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ ను పొందింది. సదరు వెబ్ సైట్ పై 2211133C అనే మోడల్ నంబర్ తో షావోమీ 13 కనిపించింది. MySmartPrice వెబ్ సైట్ ఈ విషయాన్ని గమనించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉండనుందని తెలుస్తోంది. షావోమీ 12 కూడా 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తోనే వచ్చింది.

Xiaomi 13 లైవ్ ఇమేజ్

Xiaomi 13 లైవ్ ఇమేజ్ ద్వారా మనం ఫోన్ యొక్క ఫ్రంట్, రియర్ డిజైన్ ని గమనించవచ్చు. ఫ్రంట్ పంచ్-హోల్ కటౌట్ సెల్ఫీ స్నాపర్, సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి. Xiaomi 13 ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 12జిబి ర్యామ్, 3జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్, ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ తో రానున్నట్లు మరొక వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 13 ఫోన్ వెనకాల స్క్వేర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే లేజర్ ఆటోఫోకస్ టెక్ట్స్ మాడ్యూల్ పై కనిపిస్తోంది. ఫోన్ గ్రే కలర్ లో కనిపిస్తోంది. అయితే ఇంకా ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి Xiaomi 13 గురించి తెలిసిన వివరాలివే.

Xiaomi 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi 13 స్మార్ట్ ఫోన్ 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. Xiaomi 13 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని సమాచారం.

మరోవైపు Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్ 6.73-ఇంచ్ క్యూహెచ్డీ+ ప్యానెల్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleభారత్ లో లాంచ్ అయిన Motorola Edge 30 Ultra 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్
Next articleఅక్టోబర్ 19 నుంచి మొదలు కానున్న Flipkart Big Diwali Sale
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.