హైలైట్స్
- 2023 ఆరంభంలో Redmi K60 Gaming ఎడిషన్ లాంచ్ అవుతుందని అంచనా
- Redmi K50 Gaming కి సక్సెసర్ గా వస్తోన్న Redmi K60 Gaming
- ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించిన Redmi K60 Gaming
రెడ్మీ కంపెనీ చైనీస్ మార్కెట్ లో ఈ ఏడాది ఆరంభంలో Redmi K50 Gaming ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కి సక్సెసర్ గా ఇప్పుడు Redmi K60 Gaming ఫోన్ ని రానున్న కొన్ని నెలల్లో లాంచ్ చేయాలని రెడ్మీ భావిస్తోంది. Redmi K60 Gaming డివైజ్ ని ఐఎంఈఐ డేటాబేస్ పై గమనించినట్లు ప్రముఖ వెబ్ సైట్ Xiaomiui ఓ కథనాన్ని ప్రచురించింది. Redmi K60 Gaming ఫోన్ 23011310C అనే మోడల్ నంబర్ తో కనిపించినట్లు ఆ కథనంలో ఉంది. ఇక్కడ C అంటే చైనా వేరియంట్ అని అర్థం.
Redmi 23011310C హ్యాండ్సెట్ సొక్రటిస్ అనే కోడ్ నేమ్ ని కలిగి ఉందని Xiaomiui తెలిపింది. ఇకపోతే Redmi K60 Gaming హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ 2023 లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Redmi K60 Gaming కి సంబంధించిన లీక్డ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Redmi K60 Gaming
IMEI డేటాబేస్ పై Redmi K60 Gaming 23011310C అనే మోడల్ నంబర్ తో కనిపించింది. సొక్రటిస్ అనే కోడ్ నేమ్ తో ఉన్న ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ అప్రకటిత ప్రాసెసర్ కోడ్ నేమ్ kailua అని ఉన్నట్లు Xiaomiui వెబ్ సైట్ చెప్పింది.
నవంబర్ లో జరిగే క్వాల్కమ్ టెక్ సమ్మిట్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ లాంచ్ అవుతోంది. లీక్స్ ని బట్టి స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ TSMC యొక్క 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారవుతోందని సమాచారం. ఈ చిప్ కోర్ కన్ఫిగరేషన్ 1 + 2 + 2 + 3 గా ఉంటుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఒక Cortex X3 core, రెండు Cortex A720 cores, రెండు Cortex A720 cores, మూడు Cortex A510 cores ని కలిగి ఉంటుంది.
మోడల్ నంబర్ ని బట్టి, Redmi K60 Gaming 2023 ఆరంభంలో చైనా మార్కెట్ లో లాంచ్ అవుతుందని Xiaomiui రిపోర్ట్ తెలియజేస్తోంది. Redmi K60 Gaming స్మార్ట్ ఫోన్ చైనాకు బయట రిలీజ్ అయ్యే అవకాశం లేదని సమాచారం. కనీసం పోకో రీబ్రాండ్స్ గా కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే Redmi K40 Gaming, Redmi K50 Gaming ఫోన్లు POCO F3 GT, POCO F4 GT గా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. Redmi K60 Gaming స్మార్ట్ ఫోన్ ని కేవలం చైనా మార్కెట్ కే పరిమితం చేయాలని రెడ్మీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు Redmi K60 Gaming కి సంబంధించి తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇంతే. Redmi K60 Gaming యొక్క ఎన్నో వివరాలు రహస్యంగానే ఉన్నాయి. అయితే, రానున్న వారాల్లో ఈ ఫోన్ కి సంబంధించిన మరింత సమాచారం బయటకు రావడం ఖాయం. ఈలోపు ఓసారి Redmi K50 Gaming స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేయండి.
Redmi K50 Gaming స్పెసిఫికేషన్స్
Redmi K50 Gaming స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇంకా ఈ హ్యాండ్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. Redmi K50 Gaming లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












