హైలైట్స్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Vivo X90
- 2022 డిసెంబర్ లో చైనాలో Vivo X90 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా
- 2023 జనవరి నుంచి ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న Vivo X90 సిరీస్
త్వరలోనే Vivo X90 సిరీస్ లాంచ్ అవ్వబోతోంది. అయితే కంపెనీ నుంచి ఇప్పటి వరకు లాంచ్ తేదీకి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. 2022 డిసెంబర్ లో Vivo X90 సిరీస్ లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 2023 జనవరి నుంచి ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో Vivo X90 సిరీస్ ఎంట్రీ ఇస్తుంది. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+. లాంచ్ సమీపిస్తున్న తరుణంలో Vivo X90 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
స్టాండర్డ్ వేరియంట్ Vivo X90 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది. రాబోవు బేసే-లెవెల్ ఫ్లాగ్షిప్ అప్‌గ్రేడ్ చేయబడిన డిస్ప్లే, ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోందని టిప్‌స్టర్ తెలిపింది. Vivo X90 యొక్క కెమెరా హార్డ్‌వేర్ గురించి కూడా టిప్‌స్టర్ కొన్ని వివరాలను లీక్ చేసింది. మరి Vivo X90 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Vivo X90 స్పెసిఫికేషన్స్
Vivo X90 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. నవంబర్ లో ఈ ప్రాసెసర్ అధికారికంగా లాంచ్ కానుంది. క్వాల్కమ్ తీసుకొస్తున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 కి పోటీగా డైమెన్సిటీ 9200 ని మీడియాటెక్ తీసుకొస్తోంది. ఇకపోతే గత మోడల్ Vivo X80 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడటం జరిగింది.
Vivo X90 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇదివరకు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోందంటూ వచ్చిన వార్తలకు ఈ తాజా వార్తకు తేడా ఉంది. ఇకపోతే ఈ డివైజ్ 4700 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని టిప్‌స్టర్ వెల్లడించింది.
Vivo X90 లో 1.5 కే రెజుల్యూషన్ డిస్ప్లే ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. అలాగే ఈ ఫోన్ లో అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. గత మోడల్ Vivo X80 ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వచ్చింది.
ఇప్పుడు Vivo X90 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. స్టాండర్డ్ వేరియంట్ Vivo X90 లో సోని ఐఎంఎక్స్8-సిరీస్ ప్రైమరీ కెమెరా లెన్స్ ఉంటుందని సమాచారం. రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే, ప్రైమరీ లెన్స్ 50ఎంపి అయి ఉంటుందని చెప్పవచ్చు. దీనికి తోడు 13 ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీ-పోట్రెయిట్ లెన్స్ ఉంటాయి. లో-లైట్ కెమెరా పెర్ఫామెన్స్ తో పాటు పొట్రెయిట్ షాట్స్ కోసం వివో వీ2 చిప్ కూడా ఇందులో ఉంటుందని అంచనా వేస్తున్నాం.
ఈసారి రాబోవు Vivo X90 స్టాండర్డ్ వేరియంట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టంట్ అయి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఐపీ68 సర్టిఫికేషన్ మాత్రం ఉండకపోవచ్చు. త్వరలోనే Vivo X90 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమవ్వడం ఖాయం. అప్పుడు మీకు మరింత సమచారాన్ని అందజేస్తాం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












