హైలైట్స్
- నవంబర్ 9 న ఇండోనేషియాలో లాంచ్ కానున్న Realme 10
- విడతలుగా ఫోన్ వివరాలను రివీల్ చేస్తోన్న కంపెనీ
- లాంచ్ కి ముందు రివీల్ అయిన రియల్మీ 10 స్పెసిఫికేషన్స్, బెంచ్ మార్క్ స్కోర్స్, పూర్తి డిజైన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Realme త్వరలో Realme 10 ఫోన్ ని ఇండోనేషియాలో నవంబర్ 9 న లాంచ్ చేయబోతోంది. రియల్మీ గత కొన్ని రోజుల నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను లాంచ్ టీజర్ల రూపంలో రివీల్ చేస్తూ వస్తోంది. అయితే, లాంచ్ కి ముందు అన్‌బాక్సింగ్ వీడియోలు, ఇమేజెస్ ని ఎంతోమంది టిప్‌స్టర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో Realme 10 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, బెంచ్ మార్క్ స్కోర్స్, పూర్తి డిజైన్ బయటకు వచ్చాయి.
లీకైన ఇమేజెస్ ని బట్టి Realme 10 లో బాక్స్ తో పాటు చార్జర్ కూడా వస్తున్నట్లు స్పష్టమైంది. ఇదొక మంచి పరిణామమని చెప్పొచ్చు. ఇటీవలె కొన్ని నార్జో డివైజెస్ కి రియల్మీ చార్జర్స్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేయలేదు. ఓసారి Realme 10 యొక్క అన్‌బాక్సింగ్ ఇమేజెస్ కి సంబంధించిన లుక్, రియల్-లైఫ్ బెంచ్ మార్క్ స్కోర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Realme 10 4G డిజైన్
అన్ బాక్సింగ్ ఇమేజెస్ ని బట్టి Realme 10 4G కార్నర్ పంచ్ హోల్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. Realme 10 4G ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, షైనీ క్లాష్ వైట్ కలర్ తో వస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఫోన్ ఎడమవైపున సిమ్ కార్డ్ ట్రే ఉంది. టాప్ ఎడ్జ్ పై సెకండరీ మైక్రోఫోన్ ఉంది. బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, టైప్-సీ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉన్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
Realme 10 4G మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. Antutu బెంచ్ మార్క్ టెస్ట్ లో Realme 10 4G 4,00,086 పాయింట్స్ స్కోర్ ని సాధించినట్లు ఇదివరకు ఓ ఇమేజ్ ద్వారా కంపెనీ వెల్లడించింది. అయితే TechBroll రన్ చేసిన Antutu బెంచ్ మార్క్ టెస్ట్ లో Realme 10 4G 3,96,429 పాయింట్ల స్కోర్ ని నమోదు చేసింది. ఈ స్కోరు కంపెనీ చెప్పిన స్కోర్ కి దగ్గరగా ఉంది.
Realme 10 4G స్పెసిఫికేషన్స్
Realme 10 4G 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ తో వస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం Realme 10 4G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme 10 4G 8జిబి ర్యామ్ + 256జిబి వేరియంట్ లో కూడా రానుంది. అయితే, కంపెనీ ఈ వేరియంట్ ని అన్ని మార్కెట్స్ లో లాంచ్ చేసే అవకాశం లేదు. Realme 10 4G ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అల్ట్రా వాల్యూమ్ మోడ్ అనే ఫీచర్ ని రియల్మీ ఈ ఫోన్ లో అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ వాల్యూమ్ ని 200 శాతం వరకు పెంచుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











