లీకైన OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • డిసెంబర్ లో OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం
  • లాంచ్ కి ముందు లీకైన OPPO Find N2 స్పెసిఫికేషన్స్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Find N2

గతేడాది OPPO కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా తన స్వదేశానికే పరిమితం చేసింది ఒప్పో. ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో విడుదల చేయలేదు. ఒప్పో నుంచి మొదటి మడతబెట్టే ఫోన్ వచ్చి ఏడాది అవుతోంది. దీంతో కంపెనీ దీనికి సక్సెసర్ గా OPPO Find N2 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి లాంచ్ తేదీకి సంబంధించి అధికార సమాచారం ఏదీ లేదు. ఈలోపు OPPO Find N2 యొక్క స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO Find N2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వి అని భావిస్తోన్న పిక్స్ నెట్టింట్లో కనిపించాయి. లాంచ్ కి ముందు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. మరి OPPO Find N2 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? పదండి.

OPPO Find N2 స్పెసిఫికేషన్స్

OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ కాంపాక్ట్ డిస్ప్లేతో వస్తోంది. Samsung Galaxy Z Fold 4 కి ఇది పోటీ ఇవ్వనుంది. లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టి, OPPO Find N2 PGU110 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Find N2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. అయితే స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని కూడా ఒప్పో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ లోనే ఈ ఫ్లాగ్షిప్ చిప్సెట్ లాంచ్ అవుతోంది.

అయితే Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ని తీసిపడేయడానికి లేదు. ఇది కూడా ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్. ఎన్నో ఇంటెన్సివ్ టాస్క్స్ ని అవలీలగా చేసేస్తుంది. లీకైన స్క్రీన్ షాట్ ని బట్టి ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ఈ ఫోన్ లో MariSilicon X Neural Processing Unit (NPU) కూడా ఉండనుంది. ఇది ఒప్పో స్వయంగా అభివృద్ధ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాయిస్ రిడక్షన్ ఫీచర్. 4కే అల్ట్రా నైట్ మోడ్ వీడియో రికార్డింగ్ కూడా ఇందులో ఉంది.

లీకైన సమాచారాన్ని బట్టి OPPO Find N2 7.1-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4520 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 పై పని చేయనుంది. పవర్ బటన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ అయి ఉంటుందని సమాచారం. బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 Pro+ 5G డిస్ప్లే ఫీచర్స్
Next articleఒడిషాలో పేలిన Electric స్కూటర్ బ్యాటరీ, దగ్ధమైన బండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.