హైలైట్స్
- అమెజాన్ లో కొనసాగుతోన్న ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్
- సేల్ లో భాగంగా OPPO F21s Pro పై డిస్కౌంట్
- 64ఎంపి కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
ప్రస్తుతం అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా ఒప్పో స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఒప్పో ఫోన్ల కెమెరా పనితనం బాగుంటుంది. దీంతో జనాలు ఎక్కువగా ఈ ఫోన్లను కొనేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా OPPO F21s Pro స్మార్ట్ ఫోన్ పై మాంచి డిస్కౌంట్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఈ ఫోన్ 64ఎంపి కెమెరా, క్వాల్కమ్ 680 ప్రాసెసర్ తో వచ్చింది. సరే ఆఫర్ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
OPPO F21s Pro ఆఫర్
OPPO F21s Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర అమెజాన్ లో రూ.21,999 గా ఉంది. ఒప్పో ఫెంటాస్టిక్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై రూ.700 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభించనుంది. అంటే OPPO F21s Pro ఫోన్ ని రూ.19,299 కే కొనుగోలు చేయవచ్చన్న మాట.
బ్యాంక్ డిస్కౌంట్ గురించి మాట్లాడుకుంటే, OPPO F21s Pro పై ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,000 డిస్కౌంట్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1000, ఇండస్ఇండ్ బ్యాంక్ రూ.1500, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాదండోయ్, మీ పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో OPPO F21s Pro ఫోన్ ని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
OPPO F21s Pro 4G స్పెసిఫికేషన్స్
OPPO F21s Pro 4G స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. 64ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
OPPO F21s Pro లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4G డివైజ్ అయినా పర్లేదని భావించేవారు ఈ ఫోన్ ప్రయత్నించవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












