లాంచ్ కి ముందు లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్

హైలైట్స్

  • లీకైన iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్
  • సెంటర్ పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తోన్న డివైజెస్
  • త్వరలో రానున్న iQOO Neo 7s, Neo 7 SE లాంచ్ తేదీల ప్రకటన

iQOO Neo 7s, Neo 7 SE స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వీటి లాంచ్ ఉండనుంది. ఐకూ నియో 7 కి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ గా ఈ ఫోన్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. ఐకూ నియో 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వచ్చింది. తాజాగా చైనీస్ సోషల్ మీడియా వీబో పై కనిపించిన ఓ లీక్ ద్వారా ఫోన్ యొక్క రియల్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో అతి త్వరలో ఫోన్ లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. ఈ ఫోన్స్ భారత్ లో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే iQOO Neo 7 SE చైనా యొక్క 3సీ సర్టిఫికేషన్ ని పొందింది. ఈ హ్యాండ్సెట్ V2238A అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు ఇదివరకు రూమర్లు వినిపించాయి. అయితే iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానుందని సమాచారం.

iQOO Neo 7s, Neo 7 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన ఇమేజ్ ద్వారా iQOO Neo 7s స్మార్ట్ ఫోన్ 16జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. ఇందులో 512జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉండనున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇంకా ఈ డివైజ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది.

iQOO Neo 7s కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7s లో 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి.

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో రానుంది. iQOO Neo 7 SE మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. iQOO Neo 7 SE ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

iQOO Neo 7 SE లో 50 ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మ్యాక్రో యూనిట్ ఉంటాయి.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. iQOO Neo 7 SE లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

iQOO Neo 7 SE లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరిలీజ్ అయిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో
Next articleOPPO F21s Pro పై బ్యాంక్ ఆఫర్, తక్కువ ధరకే లభిస్తోన్న ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.