హైలైట్స్
- చిన్న సినిమాగా వచ్చి ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన కాంతార
- రూ.400 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టిన కన్నడ సినిమా కాంతార
- కాంతార డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో
‘కాంతార’ ఇటీవల కొన్ని రోజులుగా అందరి నోటా ఇదే పేరు వినిపించింది. కన్నడ చిత్రసీమ నుంచి ఓ చిన్న సినిమాగా వచ్చిన కాంతార దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది.
థియేటర్లలో భారీ సక్సెస్ అందుకున్న చిత్రాల ఓటీటీ రైట్స్ కి బాగానే డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కి తగ్గ మొత్తాన్ని చెల్లించి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కాంతార చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని ఓటీటీ లవర్స్ ని ఊరిస్తోంది. ఎప్పుడెప్పుడు కాంతార స్ట్రీమ్ అవుతుందా అని ఇంకా సినిమా చూడని వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో చిత్రాన్ని చూసిన వారు మరోసారి కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
థియేటర్లలో ఘన విజయం సాధించిన కాంతార సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రత్యేకించి తెలుగు, హిందీ వర్షన్స్ లో ప్రత్యేక ఆదరణ దక్కింది. దీంతో జనాలు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు ఓటీటీ విడుదల వాయిదా పడింది. తాజాగా చిత్రాన్ని నవంబర్ 24 న స్ట్రీమ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది.
నవంబర్ 24 న అమెజాన్ ప్రైమ్ లో ‘కాంతార’ స్ట్రీమ్ అవుతుందా?
ట్విట్టర్ లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అమెజాన్ ప్రైమ్, ‘కాంతార’ చిత్రాన్ని నవంబర్ 24 న స్ట్రీమ్ చేయబోతున్నట్లు ట్వీట్ చేసింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. దీంతో అందరిలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. తేదీ మార్పు ఉండటం వల్లనే ట్వీట్ ని డిలీట్ చేసిందా? లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియదు.
‘కాంతార’ చిత్ర కథ
‘కాంతార’ ఒక ఫాంటసీ త్రిల్లర్. దక్షిణ భారతీయ సంప్రదాయాన్ని ప్రధానంగా చూపించింది. గిరిజనులకు చెందిన భూమిని కొన్ని శక్తులు కాపాడుతుంటాయి. అయితే కొందరు భూమిని కాజేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో గిరిజనులకు, వారికి మధ్య పోరు కొనసాగుతుంది. ఈ మధ్యలో దైవశక్తులు ఏ విధంగా గిరిపుత్రులకు సాయపడతాయో చిత్రకథలో చూసి తరించాల్సిందే.
భారీ వసూళ్ళు సాధించిన ‘కాంతార’
‘కాంతార’ చిత్రానికి రిషబ్ శెట్టి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అతడే ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి కావడం విశేషం. ఇలా పలు బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఎక్కడా తడబడకుండా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో రిషబ్ శెట్టి విజయం సాధించాడు. అందుకే ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను రాబట్టింది కాంతార.
సప్తిమి గౌడ కాంతార చిత్రంలో కథానాయికగా చేసింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన కాంతార ఎవ్వరూ ఊహించని లాభాలను ఆర్జించి ఔరా అనిపించింది. రిషబ్ శెట్టి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ కి కూడా కొత్త ముఖమే. అయినప్పటికీ కాంతార భారీ వసూళ్ళను సాధించింది. బాలీవుడ్ లో కాంతార, పుష్ప వసూళ్ళను కూడా బ్రేక్ చేయడం విశేషం.
హొంబలె ఫిల్మ్స్ కాంతార చిత్రాన్ని నిర్మించింది. కాంతార చిత్రానికి వివిధ చిత్రసీమల నుంచి ప్రశంసలు దక్కాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా చెన్నై లోని తన ఇంటికి ఆహ్వానించి ఓ గోల్డ్ చైన్ మరియు లాకెట్ ని బహూకరించి అభినందించారు. 50 ఏళ్ళో ఒకసారి మాత్రమే కాంతార వంటి అద్భుతాలు జరుగుతాయని రజినీకాంత్ ప్రశంసించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













