160MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్; భారత్ లో లాంచ్ అవుతుందా?

హైలైట్స్

  • నవంబర్ 23 న చైనాలో లాంచ్ కానున్న Honor 80 సిరీస్
  • ఈ లైనప్ రానున్న మోడల్స్: Honor 80 5G, Honor 80 SE 5G, Honor 80 80 Pro 5G
  • 160mp మెయిన్ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోన్న Honor 80 Pro 5G

HONOR కంపెనీ త్వరలో Honor 80 సిరీస్ ని నవంబర్ 23 న లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో లాంచ్ కానున్న మోడల్స్ పేర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే Honor 80 5G, Honor 80 SE 5G, Honor 80 Pro ఫోన్లు ఈ లైనప్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు లీక్స్ ద్వారా ఈ డివైజెస్ గురించి బయటకు వచ్చిన సమాచారాన్ని ఇక్కడ మీకోసం అందజేస్తున్నాం. ఓసారి కన్నేయండి.

HONOR 80 సిరీస్ లాంచ్

Honor 80 సిరీస్ నవంబర్ 23 న లాంచ్ అవుతోంది. తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ అవ్వనున్న Honor 80 సిరీస్ తర్వాత ఇతర మార్కెట్స్ కి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలి కాలంలో భారత్ లో Honor బ్రాండ్ యాక్టివ్ గా లేదు. కాబట్టి, Honor 80 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశాలు లేవు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 23 న మధ్యాహ్నం 12 గంటలకు Honor 80 సిరీస్ లాంచ్ అవుతోంది.

Honor 80 సిరీస్ కెమెరా

Honor 80 సిరీస్ స్మార్ట్ ఫోన్ లో పవర్ఫుల్ కెమెరా ఉండనుంది. లీక్స్ ద్వారా తెలిసిన సమాచారాన్ని బట్టి, Honor 80 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 160 మెగా పిక్సెల్ కెమెరా సెన్సర్ ఉండనున్నట్లు సమాచారం. ఇది F / 1.8 అపర్చర్ ని కలిగి ఉంటుంది. అలాగే 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉండనుంది. భారీ కెమెరాలతో వస్తున్న ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటుందనడంలో సందేహం అక్కర్లేదు. యువత ప్రధానంగా కెమెరా లేదా గేమింగ్ ఫోన్స్ కొనేందుకు ఆసక్తి చూపుతారు. కాబట్టి, ఫోటోగ్రఫీ లవర్స్ ఈ Honor ఫోన్ ని కొనే అవకాశం ఉంది. అలాగే ఈ లైనప్ లో టాప్ ఎండ్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ఉంటుంది కాబట్టి ఈ చిప్సెట్ గేమ్స్ ని కూడా అద్భుతంగా హ్యాండిల్ చేయగలదు.

Honor 80 సిరీస్ స్పెసిఫికేషన్స్

Honor 80 సిరీస్ స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి. లీక్స్ ద్వారా Honor 80 సిరీస్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిశాయి. వాటి ప్రకారం, Honor 80 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే Honor 80 SE స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో రానుందని తెలుస్తోంది. ఇక టాప్ ఎండ్ ఫోన్ అయిన Honor 80 Pro డివైజ్ లో క్వాల్కమ్ యొక్క పవర్ఫుల్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఉంటుందని సమాచారం. ఈ ప్రాసెసర్ 3.2 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleSnapdragon 695 ప్రాసెసర్, 108MP కెమెరాతో లాంచ్ అయిన Realme 10 Pro 5G
Next articleKantara మూవీ ఓటీటీ అప్డేట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.