సిరామిక్ బాడీతో వస్తోన్న OnePlus 11 5G స్మార్ట్ ఫోన్

హైలైట్స్:

  • త్వరలో లాంచ్ కానున్న ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11
  • హై బిల్డ్ క్వాలిటీతో వస్తోన్న OnePlus 11, ప్రత్యేక ఆకర్షణగా సిరామిక్ బాడీ
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన OnePlus 11 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్

త్వరలోనే తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 11 ని లాంచ్ చేయాలని వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. చైనాతో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా ఏక కాలంలో OnePlus 11 సిరీస్ లాంచ్ కానుంది. తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుందని ఇదివరకే కంపెనీ ఖరారు చేసింది. ఇకపోతే తాజాగా OnePlus 11 కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన వివరాల ప్రకారం, OnePlus 11 5G నాణ్యతపై బాగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రియర్ ప్యానెల్ కోసం సిరామిక్ మెటీరియల్ ని వాడినట్లు సమాచారం. దీంతో ఫోన్ కి షైనీ, ప్రీమియమ్ లుక్ వస్తుంది. సిరామిక్ వాడటం వల్లన మైనస్ ఏంటంటే ఫోన్ బరువు పెరుగుతుంది. ఇకపోతే ఫ్రేమ్ కోసం మెటల్ ని వాడే అవకాశం ఉంది. ఫ్లాగ్షిప్ కాబట్టి కచ్చితంగా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది.

OnePlus 11 డివైజ్ 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్ తో వస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఇప్పటి వరకు వన్ ప్లస్ నుంచి వచ్చిన అన్ని ఫ్లాగ్షిప్స్ కూడా గరిష్టంగా 12జిబి ర్యామ్ ఆప్షన్ వరకు కలిగి ఉన్నాయి. అయితే వన్‌ప్లస్ 10ఆర్ చైనా వేరియంట్ మాత్రం 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్ తో వచ్చింది. ఇది ఎంట్రీ లెవెల్ ప్రీమియమ్ ఫోన్ గా పరిగణించబడుతోంది. OnePlus 11 5G యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తున్నట్లు టిప్‌స్టర్ రివీల్ చేసింది.

OnePlus 11 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇదివరకే బయటకు వచ్చాయి. ఓసారి ఆ లీకైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం పదండి.

OnePlus 11 5G స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ రివీల్ చేసిన సమాచారాన్ని బట్టి, OnePlus 11 Pro మోడల్ OnePlus 11 గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. లీకైన డిజైన్ రెండర్స్ ద్వారా ఫోన్ రియర్ కెమెరా మాడ్యూల్ సర్క్యూలర్ షేప్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ ఉంటుంది. దీనికి తోడు 48 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

OnePlus 11 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్టాండర్డ్ వర్షన్ వన్‌ప్లస్ ఫోన్ లో క్యూహెచ్డీ+ రెజుల్యూషన్ ఉండటం ఇదే తొలిసారి. టాప్ లెఫ్ట్ కార్నర్ లో హోల్ పంచ్ కౌట్ ఉంటుంది. ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోంది.

OnePlus 11 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleGalaxy M-సిరీస్ లో చవకైన 5G ఫోన్ ని తీసుకొస్తోన్న Samsung
Next articleJio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.