హైలైట్స్
- ఈ ఏడాది డిసెంబర్ లో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేయనున్న రెడ్మీ సంస్థ
- లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా లీకైన వేరియంట్స్ ఇవే: Redmi K60, Redmi K60 Pro, Redmi K60E
- Socrates, Mondrian, Rembrandt అనే కోడ్ నేమ్స్ కలిగి ఉన్న ఈ మూడు వేరియంట్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు Xiaomi ఈ ఏడాది డిసెంబర్ లో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek Redmi K60 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు వేరియంట్స్ ఇవే అంటూ సమాచారాన్ని రివీల్ చేశాడు.
కాస్పర్ చెబుతున్న దాని ప్రకారం, Redmi K60 సిరీస్ లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E వేరియంట్స్ ఉండనున్నాయి. టిప్‌స్టర్ ఈ సిరీస్ యొక్క కోడ్ నేమ్స్, చిప్సెట్స్, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Redmi K60 సిరీస్ చిప్సెట్స్, కోడ్‌నేమ్స్
Redmi K60 సిరీస్ మోడల్స్ యొక్క కోడ్‌నేమ్స్ Socrates(K60), Mondrian (K60 Pro), Rembrandt (K60E) అని కాస్పర్ తెలిపాడు. ఈ డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, మీడియాటెక్ చిప్సెట్స్ ని కలిగి ఉంటాయని తెలిపాడు. కే60ఈ మోడల్ డైమెన్సిటీ 9200 లేదా డైమెన్సిటీ 8200 చిప్సెట్ ని కలిగి ఉండే అవకాశం ఉంది.
Redmi K60 సిరీస్ యొక్క కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గతంలో ఈ సిరీస్ కి సంబంధించిన ఎన్నో లీక్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే Redmi K60 సిరీస్ ఐఎంఈఐ డేటాబేస్, 3సీ సర్టిఫికేషన్స్ పై దర్శనమిచ్చింది.
Redmi K60 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Redmi K60 వేరియంట్ 6.67-ఇంచ్ 2కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు సమాచారం. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. Redmi K60 సిరీస్ లో ఉన్న మూడు వేరియంట్లలో స్టాండర్డ్ వేరియంట్ అయిన Redmi K60 తక్కువ ధర కలిగి ఉంటుంది. ఈ డివైజ్ 12జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కలిగి ఉంటుంది.
ఇప్పుడు Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 64ఎంపి మెయిన్ సెన్సర్ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ Redmi K60 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు తెలియనున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











