హైలైట్స్
- ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, ఫ్లాట్ సైడ్స్ తో వస్తోన్న OnePlus Nord CE 3
- 6.7-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా
- 2023 ప్రథమార్థంలో OnePlus Nord CE 3 లాంచ్ అవుతుందని వినిపిస్తోన్న రూమర్లు

OnePlus సంస్థ తన నెక్ట్స్ నార్డ్-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దాని పేరు: OnePlus Nord CE 3. ఇదివరకు వచ్చిన నార్డ్ సీఈ 2 మోడల్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. డిజైన్ మరియు హార్డ్‌వేర్ పరంగా OnePlus Nord CE 3 పలు మార్పులతో వస్తున్నట్లు తెలుస్తోంది. 91మొబైల్స్ మీకోసం ఎక్స్‌క్లూజివ్ గా OnePlus Nord CE 3 యొక్క హై-క్వాలిటీ రెండర్స్ ని తీసుకొచ్చింది. అందుకు మాకు టిప్‌స్టర్ OnLeaks సహకారం అందించారు. ఫోన్ డిజైన్ OnePlus X, రీసెంట్ iPhones ని ఇన్స్పైర్ అయి తీసుకొచ్చినట్లుంది.
OnePlus Nord CE 3 రెండర్స్ ప్రోటోటైప్ యూనిట్ కి సంబందించినవని గమనించాలి. ఈ రెండర్స్ దాదాపు ఫైనల్ ప్రోడక్ట్ మాదిరే ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ గ్లాసీ బ్లాక్ కలర్ తో కనిపిస్తోంది.
OnePlus Nord CE 3 డిజైన్
పైన రెండర్స్ లో కనిపిస్తున్నట్లుగా, OnePlus Nord CE 3 కర్వ్డ్ కాకుండా ఫ్లాట్ సైడ్స్ తో వస్తోంది. దీంతో అప్పుడెప్పుడో వచ్చిన వన్‌ప్లస్ ఎక్స్ డివైజ్, ప్రస్తుత ఐఫోన్ మోడల్స్ మాదిరి లుక్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, సెంటర్ పంచ్-హోల్ కటౌట్, సెల్ఫీ కెమెరా మరియు స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. ఇక బాటమ్ లో గమనించదగ్గ చిన్ ఉంది. ఫోన్ కి ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఇక కుడివైపున ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్ ఉన్నాయి.
ఫోన్ కి వెనకాల రెండు భారీ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. పైన మాడ్యూల్ లో ఒక కెమెరా ఉండగా, క్రింద మాడ్యూల్ లో రెండు లెన్సెస్ ఉన్నాయి. వీటికి తోడు పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇక మధ్యలో వన్‌ప్లస్ లోగో ఉంది. ఫోన్ కి పై భాగాన మైక్రోఫోన్, క్రింద భాగాన స్పీకర్ గ్రిల్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్ ఉన్నాయి.
OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్
OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్ ని టిప్‌స్టర్ OnLeaks విడుదల చేసింది. దాని ప్రకారం, OnePlus Nord CE 3 లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి.
OnePlus Nord CE 3 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరాన, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
OnePlus Nord CE 3 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OnePlus Nord CE 3 లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే 2023 ఆరంభంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











