హైలైట్స్
- భారత్ లో లాంచైన Tecno Pova 4 స్మార్ట్ ఫోన్
- మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
- భారత్ లో Tecno Pova 4 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.11,999
Tecno Pova 4 భారత్ లో లాంచ్ అయ్యింది. గత నెలలో Tecno Pova 4 మరియు Tecno Pova 4 Pro ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. తాజాగా భారత్ లో ఎంట్రీ ఇచ్చిన Tecno Pova 4 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరాతో వచ్చింది.
Tecno Pova 4 లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి. మరి భారత్ లో Tecno Pova 4 ధర, లాంచ్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? అయితే పదండి.
భారత్ లో Tecno Pova 4 ధర, లభ్యత
Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి ఈ ఫోన్ ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Tecno Pova 4 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Tecno Pova 4 లో 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1640*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ నాచ్, వైడ్వైన్ ఎల్1 సర్టిఫికేషన్ ఉన్నాయి.
Tecno Pova 4 లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి. ఈ డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 5జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. Tecno Pova 4 ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Tecno Pova 4 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
Tecno Pova 4 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో డీటీఎస్ ఆడియో, స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి.
Tecno Pova 4 రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: యురనోలిత్ గ్రే మరియు క్రయొలైట్ బ్లూ. భారత మార్కెట్ లో లావా ఆరెంజ్ వేరియంట్ ని లాంచ్ చేయలేదు. Tecno Pova 4 170.59 మిల్లీ మీటర్ల పొడవు, 77.52 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.7 మిల్లీ మీటర్ల మందం, 212 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ తో వస్తోంది. Tecno Pova 4 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












