డిసెంబర్ 9 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M04

హైలైట్స్

  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Samsung Galaxy M04
  • 2022 డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచ్ అవుతోన్న డివైజ్

గెలాక్సీ ఎమ్-సిరీస్ తో త్వరలో శాంసంగ్ ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Samsung Galaxy M04. ఈ ఫోన్ 2022 డిసెంబర్ 9 న అమెజాన్ ఇండియా ద్వారా లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ మా వద్ద ఉన్నాయి. అయితే వాటినిక ఇంకా శాంసంగ్ వెల్లడించాల్సి ఉంది. పదండి ఆ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం.

Samsung Galaxy M04 ఇండియా లాంచ్ ఖరారు

పైన ల్యాండింగ్ పేజీలో కనిపిస్తున్న విధంగా, Samsung Galaxy M04 డిసెంబర్ 9 న లాంచ్ అవుతోంది. ల్యాండింగ్ పేజీ ద్వారా Samsung Galaxy M04 సీ గ్రీన్, షాడో బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 8జిబి ర్యామ్ ని కలిగి ఉంటుంది. అలాగే ఇందులో 128జిబి స్టోరేజీ ఉంటుంది. Samsung Galaxy M04 వెనకాల డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ డివైజ్ కి కుడివైపున ఉంటాయి.

ల్యాండింగ్ పేజీలో Samsung Galaxy M04 ధర రూ.9,000 కంటే తక్కువగానే ఉంది. పోస్టర్ లో డివైజ్ ధర రూ.8,XXX తో ప్రారంభమవుతుందని పేర్కొనబడింది. ఇది ఇదివరకే మీకు తెలపబడింది.

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy M04 ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. అయితే ఇతర ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Samsung Galaxy M04 ఫోన్లో గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 జీపీయూ వాడారు. Galaxy M04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Galaxy A04e ని పోలి ఉన్నాయి. అంటే, Samsung Galaxy M04 లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ తేదీని శాంసంగ్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే స్పెసిఫికేషన్స్ పై కూడా మరింత స్పష్టత రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article8GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 4
Next articleAirtel vs Jio: ఏది ఉత్తమమైన డెయిలీ 3GB డేటా ప్లాన్ అందిస్తోంది?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.