Airtel vs Jio: ఏది ఉత్తమమైన డెయిలీ 3GB డేటా ప్లాన్ అందిస్తోంది?

హైలైట్స్

  • డెయిలీ 3జిబి డేటా, ఒక నెల వ్యాలిడిటీ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్ మరియు జియో
  • ఎయిర్టెల్ 3జిబి డేటా ప్లాన్ ధర రూ.599, వ్యాలిడిటీ 28 రోజులు
  • జియో 3జిబి డేటా ప్లాన్ ధర రూ.419, వ్యాలిడిటీ 28 రోజులు

Jio రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

జియో వివిధ డేటా మరియు కాలింగ్ ప్లాన్స్ ని అందిస్తోంది. అయితే డేటాతో కూడిన కాలింగ్ ప్లాన్స్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకోసం జియో రూ.419 ప్లాన్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజు 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. రూ.419 రీచార్జ్ ప్లాన్ ద్వారా 3జిబి డేటాతో పాటు, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.419 ప్రీపెయిడ్ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లు పైన పేర్కొనబడిన బెనిఫిట్స్ తో పాటు మరిన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్యాక్ తో జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ వంటి వాటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Jio Rs.419 ప్లాన్ బెనిఫిట్స్

  • డెయిలీ 3జిబి డేటా
  • అపరిమిత కాల్స్
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • 28 రోజుల వ్యాలిడిటీ
  • జియో టీవీ యాక్సెస్
  • జియో సినిమా యాక్సెస్
  • జియో సెక్యూరిటీ యాక్సెస్
  • జియో క్లౌడ్ యాక్సెస్

Airtel రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ లో వివిధ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత కాలింగ్, డెయిలీ 3జిబి డేటా అందించే ప్లాన్ మాత్రం ఇదే. ఇంతకంటే తక్కువ ధరలో ఈ తరహా బెనిఫిట్స్ ఇచ్చే మరొక ఎయిర్టెల్ ప్లాన్ లేదు. రూ.599 ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే డెయిలీ 3జిబి డేటా, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

రూ.599 ప్లాన్ ని రీచార్జ్ చేసే వారికి ప్రతిరోజూ 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఈ ప్లాన్ తో లభిస్తుంది. ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అలాగే ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాప్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel Rs.599 ప్లాన్ బెనిఫిట్స్

  • డెయిలీ 3జిబి డేటా
  • 28 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • అపరిమిత కాల్స్
  • అపోలో 24/7 సర్కిల్
  • రూ.100 ఫాస్టాగ్ క్యాష్‌బ్యాక్
  • ఉచిత హలో ట్యూన్స్
  • వింక్ మ్యూజిక్ యాక్సెస్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleడిసెంబర్ 9 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M04
Next article17GB ర్యామ్, 45W చార్జింగ్, 6.8-ఇంచ్ డిస్ప్లేతో లాంచైన Tecno Phantom X2 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.