20GB ర్యామ్, 108MP కెమెరా, 33W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro

హైలైట్స్

  • భారత్ లో లాంచైన Realme 10 Pro స్మార్ట్ ఫోన్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10 Pro
  • 8జిబి వర్చువర్ ర్యామ్ ఫీచర్ తో వచ్చిన Realme 10 Pro

రియల్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న Realme 10 Pro సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Realme 10 Pro మరియు Realme 10 Pro+ అనే రెండు మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు డివైజెస్ 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. Realme 10 Pro లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడగా, Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఈ ఆర్టికల్ లో Realme 10 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme 10 Pro స్పెసిఫికేషన్స్

Realme 10 Pro స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ స్క్రీన్ 680 నిట్స్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 16.7 మిలియన్ కలర్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ని ఇందులో వాడారు. 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Realme 10 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Realme 10 Pro 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Realme 10 Pro 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో 20 జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.

భారత్ లో Realme 10 Pro ధర, విక్రయ తేదీ

Realme 10 Pro స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి యూనిట్ ధర రూ.19,999 గా నిర్ణయించారు. Realme 10 Pro డివైజ్ నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Realme 10 Pro డిసెంబర్ 16 నుంచి ప్లిప్ కార్ట్ మరియు రియల్మీ వెబ్ సైట్, స్టోర్స్ ద్వారా సేల్ కి వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.