హైలైట్స్
- iQOO Quest Days సేల్ ప్రకటించిన ఐకూ సంస్థ
- అమెజాన్ లో దొరికే ఐకూ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తున్న కంపెనీ
- iQOO Neo 6, iQOO Z6, iQOO 9SE ఫోన్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్
- డిసెంబర్ 12 వరకు అమెజాన్ లో అందుబాటులో ఉండనున్న సేల్
iQOO Quest Days అనేవి ఐకూ సంస్థ అందించే నెలవారీ సేల్. ఈ సేల్ లో భాగంగా తన ఉత్పత్తులపై ఐకూ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తుంది. ఈసారి సేల్ లో iQOO Neo 6, Z6, 9 SE డివైజెస్ పై ఐకూ చెప్పుకోదగిన డిస్కౌంట్స్ ని అందిస్తోంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న డీల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
iQOO Quest Days డిసెంబర్ సేల్ లో భాగంగా 9 SE, Neo 6, Z6 పై ఆఫర్స్
ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ లో పలు ఐకూ ఫోన్లపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఐకూ తన ఉత్పత్తులలో చాలా వాటిని ఈ సేల్ లో అందుబాటులో ఉంచింది. కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ డివైజ్ ఐకూ 9 ప్రో 5జీ నుంచి బడ్జెట్ డివైజ్ ఐకూ జెడ్ 6 లైట్ దాకా ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.
భారత్ లో ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ డిసెంబర్ 8 న ప్రారంభమైంది. ఈ సేల్ డిసెంబర్ 12 వరకు అమెజాన్ లో కొనసాగుతుంది. అన్ని డిస్కౌంట్స్ తో పాటు, ఐకూ కంపెనీ హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.8,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
iQOO 9 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.64,990 గా ఉంది. అయితే ఈ ఫోన్ ని సేల్ సమయంలో రూ.49,990 కే సొంతం చేసుకోవచ్చు. ఇది రూ.7,000 తగ్గింపు ధర మరియు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.8,000 కలుపుకున్న తర్వాతి ఎఫెక్టివ్ ధర.
ఇక iQOO 9 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇందులో స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్ వాడారు. ప్రస్తుతం దీని ధర రూ.42,990 గా ఉంది. అయితే ఐకూ క్వెస్ట్ డేస్ సేల్ సందర్భంగా ఈ డివైజ్ రూ.34,990 కి లభిస్తోంది. రూ.3,000 ప్రైస్ డ్రాప్ తో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకుని ఈ తగ్గిన ధర వర్తిస్తుంది.
స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చిన iQOO 9T 5G డివైజ్ అసలు ధర రూ.49,999 కాగా, సేల్ లో భాగంగా రూ.45,999 కే లభిస్తోంది. అయితే ఐకూ ఈ డివైజ్ పై ఎటువంటి తగ్గింపు చేయలేదు. కానీ, రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ మాత్రం లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని ఫోన్ ధర రూ.45,999 కి చేరింది.
మిడ్-రేంజ్ డివైజ్ అయిన iQOO Neo 6 యొక్క బేస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.29,999 గా ఉండగా రూ.1,000 తగ్గింపు మరియు రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని రూ.26,999 కి లభిస్తోంది.
బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ iQOO Z6 5G అసలు ధర రూ.15,499 కాగా, సేల్ సందర్భంగా డిస్కౌంట్ తో ఈ డివైజ్ రూ.13,499 కే లభించనుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇంకా మరెన్నో డివైజెస్ పై ఐకూ సంస్థ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. ఆ జాబితా ఇక్కడ ఇస్తున్నాం ఓసారి చెక్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













