డిసెంబర్ 20 న లాంచ్ అవుతోన్న Infinix Zero Ultra

హైలైట్స్

  • 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో వస్తోన్న Infinix Zero Ultra
  • డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Infinix Zero Ultra

Infinix సంస్థ తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ఫోన్లను లాంచ్ చేస్తూ తన బ్రాండ్ కంటూ ఒక ఇమేజ్ ని తెచ్చుకుంది. జనాల్లో ఈ బ్రాండ్ ఫోన్లకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతోంది. తమకు అందుబాటు బడ్జెట్ లో ఫోన్లను తీసుకొస్తున్న ఇన్ఫినిక్స్ నుంచి ఎప్పుడు కొత్త ఫోన్ వస్తుందా అని యూజర్లు వేచి చూస్తుంటారు. తాజాగా ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి Infinix Zero Ultra వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Infinix Zero Ultra డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఇక Infinix Zero Ultra లాంచ్ ఈవెంట్ లోనే Infinix Zero 20 ఫోన్ ని కూడా కంపెనీ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక Infinix Zero Ultra 5జీ డివైజ్ కాగా, Infinix Zero 20 4జీ డివైజ్.

ఈ ఏడాది అక్టోబర్ లో Infinix Zero Ultra గ్లోబల్ మార్కెట్స్ లో ఎంట్రీ ఇచ్చింది. సరే ఓసారి Infinix Zero Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Infinix Zero Ultra స్పెసిఫికేషన్స్

Infinix Zero Ultra 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ68 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. Infinix Zero Ultra ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Zero Ultra యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Zero Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 200 ఎంపి ప్రైమరీ 1/1.22-ఇంచ్ సెన్సర్, 13 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్, డ్యూయల్-ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయల్ ఫ్లాష్ తో కూడిన 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. అయితే ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తో ఈ ఫోన్ వస్తోంది.

Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ కాజ్‌లైట్ సిల్వర్, జెనెసిస్ నొయిర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సిల్వర్ కలర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 74.50 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.76 మిల్లీ మీటర్ల మందం, 231 గ్రాముల బరువు ఉంటుంది. నొయిర్ కలర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 75.08 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.16 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. బరువు 231 గ్రాములు.

Infinix Zero Ultra లో 5జీ, డ్యూయల్-సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. Infinix Zero Ultra 8జిబి+256జిబి వేరియంట్ ధర 520 డాలర్లు (సుమారు రూ.42,500) గా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article2K OLED డిస్ప్లే, 50mp టెలీఫోటో లెన్స్ తో లాంచైన Xiaomi 13 Pro
Next articleRedmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించిన షావోమి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.