లాంచ్ కి ముందు రివీల్ అయిన Lava X3 స్పెసిఫికేషన్స్, రెండర్స్

హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Lava X3, రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, రెండర్స్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, బాటమ్-ఫైరింగ్
    స్పీకర్స్ తో వస్తోన్న Lava X3
  • 4000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 6.5-ఇంచ్ డిస్ప్లే, 5ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ Lava X3 లో ఉండే అవకాశం

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలో భారత్ లో Lava X3 ఫోన్ ని లాంచ్ చేయనుంది. Amazon లో ఈ డివైజ్ యొక్క డెడికేటెడ్ మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇక Pricebaba వెబ్‌సైట్, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో ఈ డివైజ్ యొక్క ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ ని రాబట్టడంలో సఫలమైంది. లీకైన ఇమేజెస్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. వాటర్ డ్రాప్ నాచ్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి. Lava X3 స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ యూజర్లను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నారు.

Lava X3 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 9 మిల్లీ మీటర్ల మందం, 210 గ్రాముల బరువుతో రానుంది. ఈ డివైజ్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వస్తోంది.

Lava X3 డిజైన్

Lava X3 ఇమేజెస్ ని గమనిస్తే, ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఇక ఎడమ వైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంది. ఫోన్ వెనకాల చూస్తే, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే లావా బ్రాండింగ్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా కనిపిస్తున్నాయి.

Lava X3 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Lava X3 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ లో 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన 3జిబి ర్యామ్ మరియు 32జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. ఈ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

Lava X3 కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 8 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా Lava X3 బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్స్ ఉంటాయి.

Lava X3 ఇండియా లాంచ్ టైమ్‌లైన్

భారత్ లో Lava X3 స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుంది. ఇప్పటికే ఈ వెబ్ సైట్ లో Lava X3 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. త్వరలోనే Lava X3 యొక్క కచ్చితమైన లాంచ్ తేదీ వెలువడనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleతన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ లో ప్రదర్శించిన BMW
Next article12GB ర్యామ్, Dimensity 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.