హైలైట్స్
- భారత్ లో తొలిసారిగా సేల్ కి వచ్చిన Realme 10 Pro+ డివైజ్
- గత వారంలో లాంచైన Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్
- 108ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఓఎల్ఈడీ డిస్ప్లే తో లాంచైన Realme 10 Pro+
నేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ అమ్మకాలు మొదలయ్యాయి. గతవారం ఈ డివైజ్ తో పాటు రియల్మీ 10 ప్రో కూడా లాంచ్ అయ్యింది. రియల్మీ 9 ప్రో ప్లస్ ఫోన్ కి సక్సెసర్ గా Realme 10 Pro+ మార్కెట్ లోకి వచ్చింది. ఓఎల్ఈడీ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ లాంచైంది.
భారత్ లో Realme 10 Pro+ ధర రూ.24,999 తో ప్రారంభమవుతుంది. ఇక్కడ మీకోసం Realme 10 Pro+ యొక్క వేరియంట్స్, లభ్యత, ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు అందించాం. ఓసారి చూడండి.
భారత్ లో Realme 10 Pro+ ధర
Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. ఇక 8జిబి + 128జిబి యూనిట్ ధరను రూ.25,999 గా నిర్ణయించారు. అయితే 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ నేడు సేల్ కి రాలేదు. ఈ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.
Realme 10 Pro+ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: హైపర్ స్పేస్ గోల్డ్, డార్క్ మ్యాటర్, నెబులా బ్లూ. కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ పై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. Realme 10 Pro+ నేడు రియల్మీ.కామ్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వచ్చింది. అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఇక Realme 10 Pro ధర రూ.18,999 గా ఉంది. దీని సేల్స్ డిసెంబర్ 16 నుంచి మొదలవుతుంది.
Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్
Realme 10 Pro+ లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టెక్నాలజీ, 61-డిగ్రీ స్క్రీన్ కర్వేచర్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. Realme 10 Pro+ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
భద్రత కోసం Realme 10 Pro+ లో ఇన్-డిస్ప్లే పింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇంకా ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్, స్టీరియో స్పీకర్స్, హై-రెస్ ఆడియో, 4డీ గేమింగ్ వైబ్రేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ 7.78 మిల్లీ మీటర్ల మందం, 173 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ SA/NSA, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్/బైడూస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఇప్పుడు Realme 10 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












