13GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A58x 5G

హైలైట్స్

  • చైనాలో లాంచైన OPPO A58x 5G స్మార్ట్ ఫోన్
  • 8జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచైన OPPO A58x 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన OPPO A58x 5G
  • త్వరలో భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న OPPO A58x 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా OPPO A58x 5G స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 33 వాట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచైంది. ఇటీవలె OPPO A58 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన ఒప్పో తాజాగా OPPO A58x 5G ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

OPPO A58x 5G రూ.14,200 ధరతో చైనాలో లాంచైంది. భారత్ లో లాంచ్ అయ్యాక ధర మారే అవకాశం ఉంది. ఈ డివైజ్ బ్రీజ్ పర్పుల్, ట్రాన్‌క్విల్ బ్లూ మరియు స్టార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. OPPO A58x 5G యొక్క ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A58x 5G స్పెసిఫికేషన్స్

OPPO A58x 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వినియోగించారు. OPPO A58x 5G లో 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో కూడిన డిస్ప్లే, 600 నిట్స్ బ్రైట్నెస్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 16.7 మిలియన్ కలర్ సపోర్ట్, పండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

OPPO A58x 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి మొత్తం 13 జిబి ర్యామ్ లభిస్తుంది. OPPO A58x 5G లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని వినియోగించారు.

ఇప్పుడు OPPO A58x 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. OPPO A58x 5G లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సెల్ పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO A58x 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఇందులో ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఉంది. పవర్ బ్యాకప్ కోసం OPPO A58x 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleనేటి నుంచి భారత్ లో Realme 10 Pro+ సేల్ ప్రారంభం
Next article12GB ర్యామ్, Snapdragon 870 చిప్సెట్ తో లాంచ్ కానున్న Vivo S16
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.