త్వరలో లాంచ్ కానున్న POCO X5 సిరీస్; టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్

హైలైట్స్

  • POCO X5 సిరీస్ ని సోషల్ మీడియాలో టీజ్ చేసిన పోకో ఇండియా హెడ్ హిమాన్శు టాండన్
  • జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో POCO X5 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న పోకో సంస్థ
  • 4,900mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న POCO X5 5G

2022 సంవత్సరం ముగింపు ముగింట్లోకి వచ్చేసింది. అయితే 2022 కి గుడ్ బై చెబుతూ, 2023 లాంచ్ సీజన్ కూడా మొదలయ్యేందుకు ఇంకా కొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో అప్పుడే ఎన్నో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ తమ కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా స్మార్ట్ ఫోన్ లాంచెస్ కి సంబంధించిన అప్డేట్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ షేర్ చేశాడు. అయితే అతడు పోకో ఫోన్ ని మిస్ అయ్యాడు. దీంతో అతడి ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ POCO ఇండియా హెడ్ హిమాన్శు ‘మరి POCO X5 సిరీస్?’ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో హిమాన్శు టాండన్ POCO X5 5G కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇచ్చినట్లైంది. ఈ ఫోన్ జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవలె POCO X5 5G బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ మరియు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వెబ్ సైట్స్ ని విజిట్ చేసింది. సదరు వెబ్ సైట్స్ పై POCO X5 5G ఫోన్ 22101320I అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఇది జరిగిన రెండు వారాల తర్వాత చైనా యొక్క 3సీ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై 22101320C అనే మోడల్ నంబర్ తో కనిపించింది.

POCO X5 5G గురించి మాకు తెలిసిన వివరాలివే (లీక్డ్)

POCO X5 5G స్మార్ట్ ఫోన్ 4900 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుందని సర్టిఫికేషన్స్ లిస్టింగ్స్ ద్వారా తెలుస్తోంది. POCO X5 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. అయితే POCO X5 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. త్వరలోనే ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే 2023 జనవరి మొదటి త్రైమాసికంలో POCO X5 5G లాంచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయితే POCO X5 5G యొక్క మోడల్ నంబర్ ని చూస్తే Redmi Note 12 5G మాదిరి కనిపిస్తోంది. కాబట్టి, POCO X5 5G డివైజ్ రెడ్మీ నోట్ 12 5జీ ఆధారంగా చేసుకుని వస్తుందని మనం అంచనా వేయవచ్చు. అయితే కొన్ని మార్పులు చేర్పులతో POCO X5 5G వచ్చే అవకాశం ఉంది.

POCO X5 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ తో, POCO X5 Pro క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. రానున్న రోజుల్లో స్పెసిఫికేషన్స్ పై మరింత క్లారిటీ వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 200ఎంపి కెమెరాతో లాంచైన Infinix Zero Ultra
Next articleజనవరి 5 న భారత్‌ లో లాంచ్ కానున్న Redmi Note 12 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.