హైలైట్స్
- Big Holiday Sale తో వచ్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung
- ఎస్-సిరీస్, జెడ్-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన శాంసంగ్ సంస్థ
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, ఫ్లిప్ 4, ఎస్22 పై యూజర్లకు లభించనున్న డిస్కౌంట్
- ఫోల్డ్ 4 పై రూ.8,000 రిబేట్ మరియు రూ.8,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్, ఫ్లిప్ 4 పై రూ.7000 రిబేట్, రూ.7000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్

మీరు గనుక Samsung ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు కొనాలని భావిస్తుంటే ఇదే సరైన తరుణం. శాంసంగ్ కంపెనీ ప్రైస్ డిస్కౌంట్స్, రిఫండ్ ఇన్సెన్టివ్స్ ని ప్రకటించింది. ఫ్లాగ్షిప్ కొనుగోలుదారులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ ఎస్ 22 సిరీస్ పై డిస్కౌంట్స్ లభించనున్నాయి.
Samsung ఫోల్డబుల్ ఫోన్లపై డిస్కౌంట్
Samsung Galaxy Z Fold 4 పై రూ.8,000 రిబేట్, రూ.8,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ కలిపి మొత్తం 16,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.1,46,999 కే లభించనుంది. ఇక Galaxy Z Flip 4 పై రూ.7,000 రిబేట్, రూ.7,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ కలిపి మొత్తం రూ.14,000 డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ని రూ.82.999 కే కొనుగోలు చేయవచ్చు.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లను కొనుగోలు చేసేవారు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 46ఎంఎం స్మార్ట్ వాచ్ ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కామ్, రిటైల్ షాప్స్ లలో ఈ ఫోన్లను డిస్కౌంట్ పై కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ పొందాలంటే మీ పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టకోండి.
Galaxy Z Fold 3 పై రూ.20,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో దీని ధర రూ.59,999 కి చేరింది. ఇప్పుడు ఇదే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లలో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తున్న వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు.
Galaxy ఎస్-సిరీస్ డీల్స్
సేల్ సందర్భంగా, గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లపై కూడా డిస్కౌంట్ లభించనుంది. Samsung Galaxy S22 Ultra ఫోన్ పై రూ.5,000 రిబేట్ మరియు రూ.7,000 అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ లభిస్తుంది. దీంతో మొత్తం రూ.12,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ని రూ.1,02,999 కే సొంతం చేసుకోవచ్చు. ఎస్22 అల్ట్రా కొనుగోలుదారులు గెలాక్సీ వాచ్4 46ఎంఎం స్మార్ట్ వాచ్ ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు.
Galaxy S22, Galaxy S22 ఫోన్లు రూ.59,999 మరియు రూ.54,999 ధరల్లో లభ్యం కానున్నాయి. అలాగే ఈ ఫోన్ల కొనుగోలుదారులు గెలాక్సీ బడ్స్ 2 ని రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే Galaxy S21 FE ని రూ.39,999 కి, Galaxy S20 FE 5G ని రూ.32,999 కి సొంతం చేసుకోవచ్చు. అప్‌గ్రేడ్ ఇన్సెన్టివ్ మరియు క్విక్ క్యాష్ బ్యాక్ కూడా వీటికి వర్తిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











