హైలైట్స్
- 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Vivo X Fold 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్
- వచ్చే ఏడాది లాంచ్ కానున్న Vivo X Fold 2 మరియు Vivo X Flip 2
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే ఫోల్డబుల్ డిస్ప్లే, సోని ఐఎంఎక్స్866 సెన్సర్ తో రానున్న Vivo X Fold 2
Vivo X Fold 2 కి సంబంధించిన ఒక లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈసారి వచ్చిన లీక్ ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది. లీక్ ద్వారా తెలిసిందేంటంటే, వివో కంపెనీ తన ఫోల్డబుల్ ఫోన్లను 2023 ప్రథమార్థంలో లాంచ్ చేయనుందట. ఇక టైమ్ లైన్ తో పాటు Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ ని కూడా టిప్‌స్టర్ రివీల్ చేశాడు. తొలితరం ఎక్స్ ఫోల్డ్ డివైజ్ కి సక్సెసర్ గా Vivo X Fold 2 మార్కెట్ లోకి రానుంది. లాంచ్ తర్వాత Samsung Galaxy Z Fold 3 తో Vivo X Fold 2 పోటీ పడనుంది.
అయితే ఇప్పటి వరకు వివో సంస్థ భారత్ లో తన ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేయలేదు. ఈసారి మాత్రం Vivo X Fold 2 డివైజ్ ని భారత్ లో కూడా లాంచ్ చేస్తుందని మేం అంచనా వేస్తున్నాం. సరే, ఓసారి Vivo X Fold 2 నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.
లీకైన Vivo X Fold 2 లాంచ్, స్పెసిఫికేషన్స్
ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo X Fold 2 డివైజ్ తో పాటు Vivo X Flip కూడా 2023 లో లాంచ్ కానుందని స్పష్టమైంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియలేదు. లాంచ్ తర్వాత Vivo X Fold 2 ప్రధానంగా Samsung Galaxy Z Fold 4 మరియు త్వరలో లాంచ్ కాబోయే Google Pixel Fold తో పోటీ పడనుంది.
ఇంకా తెలిసిందేమిటంటే, Vivo X Fold 2 డివైజ్ 2కే ఫోల్డబుల్ డిస్ప్లే తో రానుందట. కవర్ మరియు ఇన్నర్ స్క్రీన్స్ రెండు కూడా అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కల్గి ఉంటాయని టిప్‌స్టర్ చెప్పాడు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నట్లు సమాచారం. కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. Vivo X Fold 2 లో ఓఐఎస్ తో కూడిన సోని ఐఎంఎక్స్866 మెయిన్ లెన్స్ ఉంటుంది. అయితే దీని కెపాసిటీ ఎంతో ఇంకా తెలియదు.
Vivo X Fold 2 2023 ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే Vivo X Fold స్మార్ట్ ఫోన్ కూడా ఇదే నెలలో లాంచ్ అయ్యింది. కాబట్టి, కొంచెం అటు ఇటుగా ఈ సమయంలోనే లాంచ్ కానుంది Vivo X Fold 2.
ప్రస్తుతానికి Vivo X Fold 2 యొక్క పూర్తి వివరాలు రహస్యంగానే ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












