హైలైట్స్
- జనవరి 7 న బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్న ఏథర్ ఎనర్జీ
- కాస్ట్-ఎఫెక్టివ్ టుబ్యులర్ ఫ్రేమ్ తో రానున్న కొత్త బడ్జెట్ సెగ్మెంట్ ఈ-స్కూటర్
- సరికొత్త మ్యాక్సీ స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా లాంచ్ చేయనున్న Ather
బెంగళూరుకి చెందిన ఈవీ స్టార్టప్ Ather Energy త్వరలోనే భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. జనవరి 7 న జరిగే ఏథర్ కమ్యూనిటీ డే ఈవెంట్ లో ఈ లాంచ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఏథర్ స్కూటర్ Ather 450 Plus లేదా Ather 450X ల యొక్క డౌన్‌గ్రేడ్ వర్షన్ కానీ, లేదంటే కొత్త మోడల్ గా అయినా రావచ్చని 91mobiles ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు ఉన్న ఏథర్ స్కూటర్స్ కంటే తక్కువ ధరను కలిగి ఉంటుందని సమాచారం.
భారత్ లో కొత్త ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,25,000 రేంజ్ లో ఉండే అవకాశం
త్వరలో లాంచ్ కాబోవు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ విలువైన టుబ్యులర్ ఫ్రేమ్ తో వస్తోంది. ఖరీదైన అడ్వాన్స్డ్ అల్యూమినియమ్ లటైస్ ఫ్రేమ్ ఇందులో వాడటం లేదు. ఈ ఫ్రేమ్ ని Ather 450X లో వాడారు. 2021 లో కంపెనీ పైల్ చేసిన పేటెంట్ ని బట్టి, కంఫర్ట్ ప్రధాన ధ్యేయంగా ఒక మ్యాక్సీ స్కూటర్-స్టైల్ డిజైన్ తో కొత్త ఈ-స్కూటర్ ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిలో తేలికైన కంపోనెంట్స్ వాడటం వల్లన బండి ధర కూడా తక్కువగా ఉండనుంది. ఈ కంఫర్ట్ ఓరియెంటెడ్ స్కూటర్ ఫ్లాట్ సీట్ కలిగి, విశాలమైన ఫ్లోర్ బోర్డ్ తో రానున్నట్లు సమాచారం.
Ather 450 Plus, Ather 450X ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.1,34,147 మరియు రూ.1,55,657 ఎక్స్-షోరూమ్ ధరను కల్గి ఉన్నాయి. ధర విషయంలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు హై-ఎండ్ సెగ్మెంట్ లో నిలుస్తున్నాయి. ఇక కొత్తగా రాబోవు ఈ-స్కూటర్ ఏథర్ ఆఫర్ చేయనున్న చవకైన స్కూటర్ గా నిలవనుందని సమాచారం. దీని ధర రూ.1,25,000 రేంజ్ లో ఉండనుందని అంచనా వేస్తున్నారు.
గతంలో ఏథర్ సంస్థ ఒక చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతీయ రోడ్లపై పరీక్షిస్తూ కనిపించింది. కొత్త స్కూటర్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రకారం, 3.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్కూటర్ డైమెన్షన్స్, చాసిస్ విషయంలో మార్పులతో రానున్నట్లు సమాచారం.
ఇక మిగతా విషయాలను గమనిస్తే, కొత్త పెయింట్ స్కీమ్స్ ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏథర్ తీసుకురాబోవు చవకైన ఈ-స్కూటర్ కి సంబంధించి పెద్దగా సమాచారం లేదు. ఏథర్ కమ్యూనిటీ డే ఈవెంట్ లో అసలైన విషయాలు వెలుగు చూడనున్నాయి. ఏథర్ బ్రాండ్ లో తక్కువ ధరలో బండి కొనాలనుకునే వారి కోసం సదరు కంపెనీ ఒక కొత్త సెగ్మెంట్ బండిని తీసుకురానున్నట్లు అర్థమవుతోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచైతే గనుక ఓలా బడ్జెట్ కేటగిరీ ఈ-స్కూటర్లకి గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












