డైమెన్సిటీ 700 చిప్, 13ఎంపి కెమెరాతో లాంచైన Vivo Y53t

హైలైట్స్

  • చైనాలో లాంచైన Vivo Y53t స్మార్ట్ ఫోన్
  • 13 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Vivo Y53t
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Vivo Y53t

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా వై-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేసింది. దాని పేరు: Vivo Y53t. ఈ స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ తో ఈ ఫోన్ వచ్చింది. 2023 లో కూడా వివో వై-సిరీస్ ఫోన్లకు ఇంకా హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ కే పరిమితమవ్వడం శోచనీయం.

Vivo Y53t స్మార్ట్ ఫోన్ 13ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. ఈ వై-సిరీస్ హ్యాండ్సెట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo Y53t ధర, లభ్యత

Vivo Y53t స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 999 (సుమారు రూ.12,000). 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర RMB 1099 (సుమారు రూ.13,200). జనవరి 9 నుంచి ఈ హ్యాండ్సెట్ చైనాలో కొనుగోలుకి అందుబాటులోకి వస్తోంది. భారత్ లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియదు.

Vivo Y53t స్పెసిఫికేషన్స్

Vivo Y53t స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

Vivo Y53t స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 6జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ అందించారు. Vivo Y53t స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Vivo Y53t యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y53t స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్స్ అందించారు. ఇంకా 3.5ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉంటుంది.

Vivo Y53t స్మార్ట్ ఫోన్ ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.05 మిల్లీ మీటర్ల పొడవు, 75.60 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.15 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, బైడూ, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.