హైలైట్స్
- నేడు భారత మార్కెట్ లో లాంచైన Realme 10 4G స్మార్ట్ ఫోన్
- మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి + 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చిన Realme 10 4G
- Realme 10 4G ఫోన్ 4జిబి+64జిబి వేరియంట్ ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.12,999
రియల్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న Realme 10 4G డివైజ్ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. అందుబాటు ధర, మంచి ఫీచర్ల కోసం చూసే కస్టమర్లు Realme 10 4G ని ఎంచుకోవచ్చు. నేడు భారత మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉందో తెలుసుకుందాం.
భారత్ లో నేడు Realme 10 4G స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ ఉత్తమమైన ఫీచర్లు మరియు డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంతేకాకుండా ఈ ఫోన్ లో హై-రెజుల్యూషన్ ఆడియో మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ అందించారు. ఇంకా ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ యూనిక్ గ్రేడియంట్ డిజైన్ తో వచ్చింది. సరే పదండి, ఓసారి Realme 10 4G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme 10 4G స్పెసిఫికేషన్స్
Realme 10 4G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్ తో వచ్చింది. ఇందులో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందించారు. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 1టీబీ వరకు ఎక్స్టర్నల్ మెమొరీని ఈ ఫోన్ లో అందించారు. 8జిబి ర్యామ్ వరకు ఆప్షన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. ఇందులో 8జిబి డైనమిక్ ర్యామ్ కూడా అందించారు. 40FPS PUBG సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.
Realme 10 4G లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు. ఇంకా 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Realme 10 4G కెమెరా ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రోలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఫ్లాష్ నైట్ వ్యూ అల్గారిథమ్, 121 పర్సెంట్ నైట్ షాట్ స్పీడ్ వంటివి అందించారు. ఫ్రంట్ కెమెరా క్లియర్ ఫ్యూజన్ అల్గారిథమ్ తో వచ్చింది. 200 పర్సెంట్ అల్ట్రాబూమ్ స్పీకర్, 3.5ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో ఈ ఫోన్ లో ఉన్నాయి.
Realme 10 4G స్మార్ట్ ఫోన్ 7.95 ఎంఎం మందం, 178 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme 10 4G ధర
Realme 10 4G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, ఇంట్రడక్టరీ ప్రైస్ కింద రూ.12,999 కే లభించనుంది. ఇంకా 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర రూ.16,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్స్ జనవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్ కార్ట్, రియల్మీ స్టోర్స్, రిటైల్ షాప్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












