హైలైట్స్
- చైనాలో లాంచైన OPPO A56s స్మార్ట్ ఫోన్
- మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన OPPO A56s
- చైనాలో OPPO A56s 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర రూ.13,330
OPPO A56s స్మార్ట్ ఫోన్ చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇది 2021 లో లాంచైన OPPO A56 కి సక్సెసర్ గా వచ్చింది. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గా వచ్చిన OPPO A56s మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ ని కల్గి ఉంది.
OPPO A56s స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ ఉంటాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. సరే ఓసారి OPPO A56s యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.
OPPO A56s ధర, లభ్యత
OPPO A56s స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1099 (సుమారు రూ.13,330), 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1299 (సుమారు రూ.15,750) గా ఉంది. OPPO A56s డివైజ్ ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ గురించి ప్రకటన రావాల్సి ఉంది.
OPPO A56s స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
OPPO A56s స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269 పీపీఐ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
OPPO A56s స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో వచ్చింది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వాడారు. 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OPPO A56s లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
OPPO A56s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
OPPO A56s స్మార్ట్ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 163.8 మిల్లీ మీటర్ల పొడవు, 75.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.99 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. OPPO A56s ఫోన్ 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












